నిన్నటి సమస్యకు చంద్రమౌళి రామారావు గారి పూరణ : ఆ వనచర ఖగ నర భూ దేవులు తాపసులు మునులు దేవతలు సదా భావమునఁ దలచెడు ద్విష ద్రావణుఁ డా సీత మగఁడు రక్షించు మిమున్
వేయి కనుల వాడు వినత కొడుకు అను సమస్యకు సీస పద్యము లో పూరణ ------------------------------------------------------------------------------------------------------------ ||సీ|| వేవేల కీర్తింతు విష్ణు వాహను నతి వేగవంతు డతడు, వెరపు లేక నాకాశ వీధిని నారాయణుని తన వీపున మోయుటె వేడుకనుచు విష్ణు సామీప్య త్రి విష్టప పదమును బడసిన వినయ సుభాషితుండు వేదవేద్యుని కొల్చు వేదస్వరూపుడు వేయి కనుల, వాడు వినత కొడుకు
||తే గీ|| తల్లి దాస్యము బాపిన తనయుడతడు కాశ్య పేయుడతడతి కరుణ మూర్తి నాగ దోషములను బాపి నరుల గాచు విధిని, వేయి కనుల, వాడు వినత కొడుకు
నిన్నటి సమస్యకు చంద్రమౌళి రామారావు గారి పూరణ :
రిప్లయితొలగించండిఆ వనచర ఖగ నర భూ
దేవులు తాపసులు మునులు దేవతలు సదా
భావమునఁ దలచెడు ద్విష
ద్రావణుఁ డా సీత మగఁడు రక్షించు మిమున్
అమర ధామ మందు నమరేంద్రు డనగను
రిప్లయితొలగించండివేయి కనుల వాడు , వినత కొడుకు
విష్ణు వాహ నుండు వేలుపై నిరతము
స్వామి పదము లందు నెమ్మి గొలువ
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండినిన్నటి సమస్యకు రామారావు గారి పూరణ బాగున్నది. ధన్యవాదాలు.
*
అక్కయ్యా,
విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివేయి తలలు కనులు వేయిపాదంబులు
రిప్లయితొలగించండివేయి పేర్ల వాని వీపు మోయు
భక్తులార గనుడు పరవశంబును బొంది
వేయికనుల, వాఁడు వినత కొడుకు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండివేయికనులతో గరుడదర్శనం చేయుమన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమల్లెలవారి పూరణలు
రిప్లయితొలగించండిపాల కడలి వెల్గు వైకుంఠ దాముండు
వేయికనులవాడు,వినత కొడుకు
వాహనమ్ము గాగ పాలించు భక్తుల
కూత వినిన యంత గూర్చు ముక్తి
2.వెంకటేశు దతడు వెలుగును నింపును
వేయి కనుల వాడు,వినత కొడుకు
వాహనమ్మునగుచు వాడల దిరుగాడు
కొండపైని వాని గొల్తు నేను
అమరపురికి వెళ్లి యమృతమ్మును తెచ్చి
రిప్లయితొలగించండితల్లికినొనరించె దాస్య ముక్తి
ఖగపతిగ గరుడుడు కాపాడు పక్షుల
వేయికనుల, వాడు వినత కొడుకు
భాగవతుల వారి పూరణ
రిప్లయితొలగించండికమలనయన వలువ గానక పరుగెత్తె
వేయి కనుల వాడు వినత కొడుకు
విస్తు పోయి జూచె వింత ఘటన
పద్మ నాభు డొసగు భక్త రక్ష
రిప్లయితొలగించండిభాగవతుల వారి పూరణలోమూడవ పాదము
విస్తుపోయి జూచె వింత గొల్పు ఘటన
గా చదువు కొనవలెను
పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
ఆలి లచ్చి తమ్మిచూలికి తండ్రి యే
వేయి కనుల వాడు, వినత కొడుకు
పక్కి రేడు, యతని యెక్కిరింత, వీర
లొసగు గాత మనకు పసిడి బ్రతుకు
వేయి కనుల వాడు వినత కొడుకు అను సమస్యకు సీస పద్యము లో పూరణ
రిప్లయితొలగించండి------------------------------------------------------------------------------------------------------------
||సీ|| వేవేల కీర్తింతు విష్ణు వాహను నతి వేగవంతు డతడు, వెరపు లేక
నాకాశ వీధిని నారాయణుని తన వీపున మోయుటె వేడుకనుచు
విష్ణు సామీప్య త్రి విష్టప పదమును బడసిన వినయ సుభాషితుండు
వేదవేద్యుని కొల్చు వేదస్వరూపుడు వేయి కనుల, వాడు వినత కొడుకు
||తే గీ|| తల్లి దాస్యము బాపిన తనయుడతడు
కాశ్య పేయుడతడతి కరుణ మూర్తి
నాగ దోషములను బాపి నరుల గాచు
విధిని, వేయి కనుల, వాడు వినత కొడుకు
మౌని శాపమివ్వ మఘవుండు తానయ్యె
రిప్లయితొలగించండివేయి కనులవాడు, వినత కొడుకు
అదిక శక్తి తోడ నమరుల నోడించి
ముంజ కేశు గొల్చు పులుగుల దొర
ముంజ కేశుడు: విష్ణువు
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘అమృతమును తెచ్చి’ అన్నచోట గణదోషం.‘అమృతము సాధించి’ అందామా?
*
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
‘శీనా’ శ్రీనివాస్ గారూ,
మీ సీసపద్యం బాగుంది. అభినందనలు.
‘వేయికనుల’ అన్వయం కుదిరినట్టు లేదు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ కంది శంకరయ్య గురువరులుకు నమస్కారములు
రిప్లయితొలగించండినిన్న నెట్ వర్క్ లేనందున పూరించ లేకపోయాను
ఆవహమున మరణించును
రావణుఁ డా, సీత మగఁడు రక్షించు మిమున్
''దేవా! శరణా గతులము
బ్రోవుము మమ్మంచు వేడ బుధజన హితుడౌ.''
విశ్వరూప విధుడు, విశ్వభార ధరుడు,
విశ్వ చరుడ, జితుడు, విశ్వ విభుడు
వేయికనులవాఁడు, వినత కొడుకునేల
వాహనమ్ముగ గొని వాసి పెంచె.
ఆర్తి తోడఁ బిల్వ నన్యముఁ దలపక
రిప్లయితొలగించండిభువిని భక్త జనుల బ్రోచ నెంచు
హరికి యెక్కి రింత గరుడుడు పరికించు
వేయుకనుల, వాడు వినత కొడుకు
చంద్రమౌళి రామారావు గారి పూరణ :
రిప్లయితొలగించండివేయి కనుల వాడు విస్మయం బొందగ
రక్షక భయ దాహి రాజులడల
భద్ర గతిని నమృత భాండంబుఁ గొనితెచ్చె
వేయికనుల, వాఁడు వినత కొడుకు
గోలి వారి పూరణ చాలా బాగుంది.
రిప్లయితొలగించండిఅమరపురికి బోయి యమృత భాండము దెచ్చి
రిప్లయితొలగించండికద్రువాత్మజులకు కనగబెట్టి
త్రాగనీక సుధను తరలించె వెనుకకు
వేయికనులవాఁడు వినత కొడుకు.
వేలమైళ్ళనిడివి వినువీధినెగురుచు
రిప్లయితొలగించండిక్రిందనేలగనుట విందతనికి
వేటగాంచిదివికి వేగానగొనిపోవు
వేయికనులవాడు వినతసుతుడు
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండినిన్నటి సమస్యకు, ఈనాటి సమస్యకు మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ చివర ‘హితుఁడై’ అంటే అన్వయం బాగుంటుంది.
*
సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
చంద్రమౌళి రామారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
రెండుచింతల రామకృష్ణమూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్కారములు.
రిప్లయితొలగించండిమాతృదాస్యమపుడు మాన్పఁగా నమృతమ్ముఁ
గాద్రవేయుల కిడఁగానె, దోచె
వేయికనులవాఁడు! వినతకొడుకు తల్లి
చెఱను డుల్చి, వెలిఁగె స్థిరముగాను!
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మాస్టరుగారూ ! మిస్సన్నగారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండి