9, సెప్టెంబర్ 2014, మంగళవారం

పద్యరచన - 671 (నీటిమూట)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“నీటిమూట”

7 కామెంట్‌లు:

  1. బూటక వాగ్దానము లా
    ర్భాటముగానిచ్చు నేటి పార్టీలన్నిన్
    పూటకొక మాటమార్చును
    మాటేమో నీటిమూట మాత్రమెసుమ్మా

    రిప్లయితొలగించండి
  2. ' నీతీ బ్యాంకిది ' సాలుకు
    చేతుము రెట్టింపు సొమ్ము చేరండనుచున్
    ప్రీతిగ బలుకును చాలా
    మోతగ నవిజూడ నీటి మూటలు గావే !

    రిప్లయితొలగించండి
  3. ఎన్నికలసమయమునందు నిచ్చు చుంద్రు
    వరములను మన నాయకుల్ బడుగు ప్రజకు
    గద్దెనెక్కిన పిమ్మట కాన రారు
    స్వార్థమే వారలకు పరమార్థమౌను
    నీటి మూటలే నేతల మాట లెల్ల

    రిప్లయితొలగించండి
  4. ఓటులకై వచ్చినపుడు
    మాటలు కోటలను దాటు మనుజులకెల్లన్ !
    వాటముగ గద్దెనెక్కగ
    మాటలె మరి నీటిమూట మాధవ గనుమా !

    రిప్లయితొలగించండి
  5. సగ మిచ్చిన పైకమ్మది
    దిగి వచ్చును వస్తు వనుచుఁ దేల్చుచు మనలన్
    సగబెట్టుకు ధనమంతయు
    నెగిరెద రది 'నీటిమూట' నిజమిది సుమ్మా!

    రిప్లయితొలగించండి
  6. శ్రీగురుభ్యోనం:

    కల్ల బొల్లు కథలు కల్పించి చెప్పంగ
    రాజకీయ మొక్క రాచబాట
    భ్రమలు గొలిపి ప్రజకు పనులు జేతుమనెడి
    నేత మాట నేడు నీటిమూట

    కూటికి గతి లేకున్నను
    కోటికి పడగెత్తిరిపుడు కొందరు నేడీ
    నీటిని మూటలు గట్టగ
    యేటికి యేళ్ళన్ని తరిగి యెండిన వకటా!

    (water packets,water bottles)

    రిప్లయితొలగించండి
  7. కవిమిత్రులు నమస్కృతులు.
    నిన్న ఉదయం హైదరాబాదుకు వెళ్ళి ఇప్పుడే ఇల్లు చేరాను. రోజంతా ఎక్కడా బ్లాగు చూడడానికి అవకాశం దొరకలేదు. అందువల్ల నిన్నటి పూరణలను, పద్యాలను సమీక్షించడానికి అవకాశం దొరకలేదు. ఈనాటి పద్యరచన, న్యస్తాక్షరి శీర్షికలను షెడ్యూల్ చెయ్యడానికి వీలులేకపోయింది. ఇప్పుడు కూడా ఏదో ఇవ్వాలను మొక్కుబడిగా ఇచ్చినవే.
    నిన్నటి శీర్షికకు చక్కని పద్యా లందించిన కవిమిత్రులు....
    చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    శైలజ గారికి,
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
    శ్రీపతి శాస్త్రి గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి