20, సెప్టెంబర్ 2014, శనివారం

పద్యరచన - 682 (నదీతీరము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“నదీతీరము”

11 కామెంట్‌లు:

  1. సుందర నదీ తటమునం
    దిందిందిర ఝంకరింపు దీయనగొలిపెన్
    బృందంబుగ పావురములు
    సందడి గొలుపుచునట జనసందోహంబున్

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    మా మహా గొప్పదౌ - మానదీ తీరము :

    01)
    ________________________________

    *స్రగ్విణి*
    చందమే యందమై ♣ శబ్దమే శ్రావ్యమై
    పొందికై యొద్దికై ♣ పొంగుచున్ పారుచున్
    మందికిన్ మంచిగా ♣ మబ్బుపూ విచ్చుచున్
    ఉందిలే చక్కగా ♣ నూరికే ప్రక్కగా !

    ఊడలా మర్రితో ♣ నూసులన్ జేయుచూ
    నోడలన్ మోయుచూ ♣ నూపుచున్ నేర్పుగా
    నేడకో పంపుతూ ♣ యేటినో దింపుతూ
    వేడుకల్ పంచుచూ ♣ వేడగా నందరున్ !

    నీడగా నిల్చునే ♣ నిత్యమై సత్యమై
    బీడుభూమ్మీదుగా ♣ పీథమున్ బంపుచున్
    మాడదే నాడునూ - మా నదీ తీరమూ
    చూడగా రండహో ♣ చూచి హర్షింపగాన్ !
    ________________________________
    చందము = ఆకారము
    మబ్బుపూవు = నీళ్లు
    మాడు = ఎండు

    రిప్లయితొలగించండి
  3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    స్రగ్విణీ వృత్తాలలో మీ యేటియొడ్డును చక్కగా వర్ణించారు. బాగుంది. అభినందనలు.
    వ్యావహారిక పదాల ప్రయోగం కొద్దిగా ఎక్కువైంది.

    రిప్లయితొలగించండి
  4. తటిని జలములు దిగువకు తరలు చుండ
    రంగురంగుల మీనముల్ రమ్యముగను
    కదలుచుండగ నీటిపై కరము వేగ
    తటముకడ నుండి గాంచిన తనివి గలుగు

    రిప్లయితొలగించండి
  5. నది తీరములకు నడుమనె
    కదలుచు పరుగులు పెడుతును, కనులకు నంద
    మ్మెదకానందము నొసగుచు
    తుదకా సాగరముఁ గలియు తొందర పడుచున్.

    రిప్లయితొలగించండి
  6. నదులకు తీరము లుండును
    పదిలముగా దాట వాని వంతెన యునున్
    చదునుగ నుండను జేతురు
    అదియంగా సుకర మౌను నటు నిటు పోవన్

    రిప్లయితొలగించండి
  7. రమణీయ నదీ తీరము
    కమనీయ సమీరమందు కాణాచి గదే!
    యమునా తీరమె రాధకు
    నమరెన్ మాధవు వరించ నావాసంబై!

    రిప్లయితొలగించండి
  8. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. తీరగు నగరాలు నదీ
    తీరములో వెలసి పుణ్య తీర్ధము లాయెన్
    ధారుణి పులకించి జనులు
    చేరునచట భక్తి భావ చింతన తోడన్ !

    రిప్లయితొలగించండి