3, జులై 2014, గురువారం

పద్యరచన - 609

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11 కామెంట్‌లు:

  1. వీధి నాటక ములయందు వేడు కనగ
    తొల్లి భాగవతు లెల్లరు పల్లె లందు
    హావ భావాలు ప్రకటించి హాస్య మలర
    జనుల రంజింప జేయుచు గనగ వింత

    రిప్లయితొలగించండి
  2. అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘రంజింప జేసిరి’ అంటే అన్వయం బాగా కుదురుతుంది.

    రిప్లయితొలగించండి
  3. రామ లక్ష్మణ సీతయు రమ్యముగను
    భక్త మారుతి వారితో బయలు దేరి
    జనుల నానంద పరచగా సంచరించు
    నాటకమునందు పాత్రలు నడచి వచ్చి
    పగటి వేషాలు గట్టును పల్లె లందు

    రిప్లయితొలగించండి
  4. శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. పూర్వ మందున నాటక ములు విరివిగ
    వేయు చుండెడి వారలు వీధి నాట
    కములు తదుపరి వచ్చెను కమల !వినుము
    చలన చిత్రము లేయిక జాలి నన్ని

    రిప్లయితొలగించండి
  6. వీధి నాటక కళ కనువిందు జేయ
    రామ గాధను మలిచిరి రమ్యముగను
    రామ చరితయుండు తరతరాల వరకు
    మనిషి నడవడి చక్కగా మార్చు నెపుడు

    రిప్లయితొలగించండి
  7. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    ప్రయాగ రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యము...

    వీధినాటకముల వివిధవేషములతో
    పల్లెజనుల మనము పరవశించు
    వేడి కాలమంచు పిల్లలుఁ బెద్దలు
    వీక్ష సేయుచుంద్రు వింతకళను.

    రిప్లయితొలగించండి
  9. భావ రాగ తాళ ప్రకటనా బలమున
    పగటి వేష మలరు భాష మెరయ!
    నాదరంబు లేక యాకలి తీరదు
    ప్రభుత తోడు రాక బ్రతుకు లేదు!

    రిప్లయితొలగించండి
  10. పొట్ట కూటికొరకు పురవీధులతిరిగి
    వీధి నాటకములు వేయువారు
    కాలగర్భమందు కనుమరుగాయెరా
    కళకు విలువ లేని కాలమందు

    రిప్లయితొలగించండి
  11. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గుండా సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి