11, జులై 2014, శుక్రవారం

పద్యరచన - 617

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. చంపబూనిన పూతన చంకనెత్త
    విషముబూసిన పాలిండ్ల విశ్వవిభుడు
    చప్పరించుచు లాగెను పాలతోనె
    దాని ప్రాణమ్ము లన్నియు తనను జేర.

    రిప్లయితొలగించండి
  2. విషధర శయనుడు హరికిన్
    విషమే మొనరించు భువిని, విశ్వంబరుడే
    విష మానస పూతన చను
    విష దుగ్ధము పీల్చిదాని పేరడ గించెన్.

    రిప్లయితొలగించండి
  3. ప్రీతిగ కంసుని పనుపున
    పూతన విషపాలనీయ పొలుపున రాగా
    పాతకి ప్రాణము దీసిన
    భూతలనాధుని గొలువగ పోవును నఘముల్

    రిప్లయితొలగించండి
  4. పూతన చను గుడుపగ హరి
    మూతిని జేర్చంగ జీవ మూలము బీల్చెన్!
    ఘాతకి కందెను పుణ్యము
    యాతన లేనట్టి చావు హరినే జేర్చన్!

    రిప్లయితొలగించండి
  5. కంసు పనుపున పూతన కరము వేగ
    విషము నియ్యగ నేతెంచి విష్ణు కడకు
    స్తన్య మిచ్చెడి నెపమున చనియె దరికి
    ప్రాణమును గొనె నాహరి పాల తోడ

    రిప్లయితొలగించండి
  6. మృషలను పల్కి బాలకుని మృత్యువు పాలొనరింప వచ్చె నా
    విషకుచకుంభ పూతన వివేకము మాసి! యశోద బిడ్డ తా
    మిష గొని పాలు త్రాగుచును మెల్లగ రక్కసి ప్రాణముల్ సహా
    విషమును మ్రింగి నాడహహ ! వేల్పులు, గొల్లలు సంతసింపగన్.

    రిప్లయితొలగించండి
  7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘విషపాలు’ అన్నది దుష్టసమాసం. ‘విషదుగ్ధ మీయ’ అనండి.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    “ప/ద్దియమును వ్రాసినాఁడ వహ ధీనిధు లెల్లరు సంతసింపగన్”... అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. మిస్సన్న గారి పద్యము దృశ్యాన్ని కళ్లకు కట్ట్టినట్లు అద్భుతంగా వుంది.వారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. టక్కరి బుద్ధులన్ కసిని డాయుచు ఊయల నందు నూగు యా
    చక్కని బాలకృష్ణునకు చయ్యన చేదగు స్తన్యమీయగా
    గ్రక్కున పాలతో దనుజ ప్రాణము పీల్చ, మహాద్రి పోలికన్
    దిక్కులు పిక్కటిల్లఁ బడె దీనత తో పెడబొబ్బ పెట్టుచున్

    రిప్లయితొలగించండి
  10. గురువుగారికి ధన్యవాదాలు. ఇదేదో బాగుంది.

    దియమును వ్రాసినాఁడ హహ ధీనిధు లెల్లరు సంతసింపగన్

    అని సమస్యనీయ వచ్చునేమోనండీ.

    రిప్లయితొలగించండి

  11. గుండా వేంకట సుబ్బ సహ దేవుడు గారికి ధన్యవాదములు. వారి పద్యాలు కూడా మిత్రులందరినీ అలరిస్తూ ఉంటున్నాయి.

    రిప్లయితొలగించండి
  12. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి