5-2-2015 (బుధవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రావణ గమనుండు బెదరి రావణుఁ గొల్చెన్”
(లేదా...)
“రావణ వాహనుం డడలి రావణుఁ గొల్చె సమిత్రుఁడై వెసన్”
4, ఫిబ్రవరి 2025, మంగళవారం
సమస్య - 5024
3, ఫిబ్రవరి 2025, సోమవారం
సమస్య - 5023
4-2-2015 (మంగళవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాండవులు వారధినిఁ గట్టు వానరులఁట”
(లేదా...)
“వారలు పంచపాండవులు వారధిఁ గట్టిన వానరుల్ గదా”
2, ఫిబ్రవరి 2025, ఆదివారం
సమస్య - 5022
3-2-2015 (సోమవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సౌరభము లేదు మెచ్చిరి చంపకమును”
(లేదా...)
“సౌరభమింత లేదు మరి చంపకమాలను మెచ్చి రెల్లరున్”
1, ఫిబ్రవరి 2025, శనివారం
సమస్య - 5021
2-2-2015 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాముని తనయుఁ డగుచు భృగురాముఁడు పుట్టెన్”
(లేదా...)
“రాముని పుత్రుఁడౌచు భృగురాముఁడు పుట్టెనటంద్రు పండితుల్”
31, జనవరి 2025, శుక్రవారం
సమస్య - 5020
1-2-2015 (శనివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గ్రామసింహ మగుచుఁ గదలుటొప్పు"
(లేదా...)
“గ్రామపు సింహమై కదలఁగాఁ దగుఁ గీర్తి గడింపఁ గోరినన్”
(కంబాల రాజేశ్వర రావు గారికి ధన్యవాదాలతో...)
30, జనవరి 2025, గురువారం
సమస్య - 5019
31-1-2015 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గంజాయిని సాగుచేయగా వలె రైతుల్”
(లేదా...)
“గంజాయిన్ దగ సాగు చేయవలె సౌఖ్యంబబ్బు రైతన్నకున్”
29, జనవరి 2025, బుధవారం
సమస్య - 5018
30-1-2015 (గురువారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హారము కొఱ కుద్యమం బహర్నిశలయ్యెన్”
(లేదా...)
“హారము కోసమై జను లహర్నిశలుం గృషి సేయఁగావలెన్”
28, జనవరి 2025, మంగళవారం
సమస్య - 5017
29-1-2015 (బుధవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“లచ్చి మగఁ డెద్దుపై నెక్కి లంకఁ జేరె”
(లేదా...)
“లక్ష్మీనాథుఁడు నందివాహనముపై లంకాపురిం జేరెఁ బో”
27, జనవరి 2025, సోమవారం
సమస్య - 5016
28-1-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అర్ధాంగీ కృతి గనుఁగొన వ్యర్థంబయ్యెన్”
(లేదా...)
“అర్ధాంగీ కృతి వ్యర్థమై చనియె లక్ష్యంబయ్యొ దుర్లభ్యమౌ”
26, జనవరి 2025, ఆదివారం
సమస్య - 5015
27-1-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలతో వైరమ్ము దప్పఁగలదే భ్రాతా”
(లేదా...)
“కలతో వైరము దప్పదా మనకు భాగ్యప్రాప్తికై సోదరా”
25, జనవరి 2025, శనివారం
సమస్య - 5014
26-1-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శంకరుండు వలదు శాంతి వలయు”
(లేదా...)
“శంకరుండు వద్దు మాకు శాంతి గావలెన్ సదా”
24, జనవరి 2025, శుక్రవారం
సమస్య - 5013
25-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మదిరాసక్తుఁడె నిలుపును మర్యాద సభన్”
(లేదా...)
“మదిరాసక్త విలాస చిత్తుఁడె సభామర్యాదఁ గాపాడెడిన్”
23, జనవరి 2025, గురువారం
సమస్య - 5012
24-1-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కంటన్ గంకణమిడెఁ దిలకమును గరమునన్”
(లేదా...)
“కంటను గంకణమ్ము దిలకమ్ము గరమ్ము నలంకరించెడున్”
(ఆకాశవాణి సమస్య)
22, జనవరి 2025, బుధవారం
సమస్య - 5011
23-1-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సుగ్రీవాగ్రజుని కాలు శునకము గఱచెన్”
(లేదా...)
“సుగ్రీవాగ్రజు పాదమున్ శునక మచ్చోఁ గాటువేసెన్ వడిన్”
(ప్రసిద్ధమైన పాత సమస్య. 'సుగ్రీవుని యెడమకాలు' వృత్తంకోసం - 'సుగ్రీవాగ్రజుని కాలు' అయింది)
21, జనవరి 2025, మంగళవారం
సమస్య - 5010
22-1-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆగెఁ గాలమ్ము భాస్కరుఁ డాఁగకున్న”
(లేదా...)
“ఆగెను కాలచక్ర మది యబ్జసఖుం డపు డాఁగకుండినన్”
(శిష్ట్లా లక్ష్మీ వేంకట నరసింహ శర్మ గారికి ధన్యవాదాలతో...)
20, జనవరి 2025, సోమవారం
సమస్య - 5009
21-1-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మోదము నందున నొగులు సమున్నతము గదా”
(లేదా...)
“మోద మహానుభోగమున ముఖ్యమునైనది దుఃఖమే కదా”
(శిష్ట్లా లక్ష్మీ వేంకట నరసింహ శర్మ గారికి ధన్యవాదాలతో...)
19, జనవరి 2025, ఆదివారం
సమస్య - 5008
20-1-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాదు రాదది రమ్మనన్ రానెరాదు”
(లేదా...)
“రాదది రానెరాదు గన రాదిక రమ్మన రాదు రాదికన్”
(శిష్ట్లా లక్ష్మీ వేంకట నరసింహ శర్మ గారికి ధన్యవాదాలతో...)
18, జనవరి 2025, శనివారం
సమస్య - 5007
19-1-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వేడిన నిష్ఫలము గాదె వేంకటపతినిన్”
(లేదా...)
“వేడుకొనంగ నిష్ఫలము వేంకటనాథుని భక్తితో జనుల్”
17, జనవరి 2025, శుక్రవారం
సమస్య - 5006
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూరులో నెప్పుడున్”
(ఈరోజు గుంటూరులో పూసపాటి వారి 'పద్య పాఠశాల' వార్షికోత్సవము)
16, జనవరి 2025, గురువారం
సమస్య - 5005
17-1-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పెండ్ల మర్ధాంగి వల్లభ ప్రేయసి సతి”
(లేదా...)
“పెండ్లము గేస్తురాలు సతి ప్రేయసి వల్లభ దార జాయయున్”
15, జనవరి 2025, బుధవారం
సమస్య - 5004
16-1-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చాచా తుర్యంబు శ్రవణసౌఖ్యం బొసఁగున్”
(లేదా...)
“చాచా తుర్యము వింతగన్ జెవులకున్ సౌఖ్యంబు నిచ్చున్ గదా”
(కందపాదం నారసింహ పురాణం లోనిది)
14, జనవరి 2025, మంగళవారం
సమస్య - 5003
15-1-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అడరెను భీముని యెడఁద బకాసురుఁ జూడన్”
(లేదా...)
“అడలి వడంకె భీముని హృదంతరసీమ బకాసురున్ గనన్”
13, జనవరి 2025, సోమవారం
సమస్య - 5002
14-1-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
సంక్రాంతి శుభాకాంక్షలు!
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చాంద్రమానమున మకర సంక్రమణము”
(లేదా...)
“కనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్”
సమస్యాపూరణం – 5000 (ఊకదంపుడు)
ప్రసిద్ధ బ్లాగర్, బ్లాగులోకంలోకి నేను రావడానికి ప్రేరణ నిచ్చినవారు 'ఊకదంపుడు' గారు నా బ్లాగు ప్రారంభంనుండి దీని ఎదుగుదలను పరిశీలిస్తున్నవారు. నా బ్లాగులో నిన్న 5000 సమస్యలు పూర్తయిన సందర్భంగా వారి బ్లాగులో ఒక పోస్ట్ పెట్టారు. దాన్ని యథాతథంగా మీముందు ఉంచుతున్నాను....
సమస్యాపూరణం – 5000
- ఊకదంపుడు
జనవరి 12, 2025
జూన్ 4, 2010 ఉదయం 6 గంటల 30 నిముషాలు.. పంచాగములో ఉన్నా లేకున్నా ఇదొక శుభలగ్నం. సుమూర్తం. ఎందుకంటే కంది శంకరయ్య గారు ఈ ముహూర్తములోనే తమ బ్లాగులో మొదటి సమస్య నిచ్చారు.
ఆనాటికి వారివద్ద సరియైన కంప్యూటరు లేదు, వారికి బ్లాగు వ్రాయటమూ తెలియదు. పట్టుదలతో బ్లాగ్ వ్రాయటము, కంప్యూటరు వాడకము నేర్చుకొన్నారు. బ్లాగ్ నిర్వహణని జీతంరాని రెండవ ఉద్యోగముగా భావించారు (అప్పటికే తెలుగు పండితులుగా పదవీ విరమణ చేసారు). బడిలో అధ్యాపకత్వాన్ని ఎంత దీక్షతో నిర్వహించారో, శంకరాభరణమునూ అంతే దీక్షతో నిర్వహించారు, నిర్వహిస్తున్నారు. నిజానికి ఆ బడి నయము, బోలెడు సెలవలు. ఈ బడిలో సెలవలు సున్నా.
మొదట చిన్న చిన్న సమస్యలు ఇచ్చేవారు. వ్రాసే వారిని ప్రోత్సహించటానికి తప్పుల నెత్తిచూపకుండా అభినందించేవారు. తరువాత మెల్లగా తప్పులు వివరించటం, ఆపై చిన్న చిన్న పాఠాలు ప్రకటించటం మొదలు పెట్టారు. ప్రయాణములు, అడపా దడపా వచ్చే జ్వరాదులు, కౌటుంబిక బాధ్యతలు కూడా వీరిని ఏనాడూ సమస్యను ప్రకటించకుండ ఆపలేకపోవటము అంతర్జాలపద్యకవుల అదృష్టము. మెల్లగా సమస్యాపూరణలకే పరిమితము కాకుండా దత్తపదులు, చిత్రానికి పద్యము, పద్యపూరణము, వ్యస్తాక్షరి ఇవ్వసాగారు.
పద్య విద్యలో ఓనమాలు కూడ తెలియక వీరి వద్ద నేర్చి కవులైనవారెందరో. ప్రవేశం ఉండి తమ పద్యవిద్యను విశేషముగా తీర్చిదిదికొనిన వారింకెందరో. సమస్యాదులను పూరించి ఈ వేదికకి కవనపరిపుష్టిని కలిగించిన లబ్ధప్రతిష్టులైన విద్వత్కవులెందరో.
వీరు నేడు సాహితీలోకములో ముఖ్యముగా అవధానరంగములో సుప్రసిద్ధులు కావటం కడు ముదావహము. వీరి ఆంధ్రసాహిత్య వరివస్యను గుర్తించి "సమస్యాపృచ్ఛక చక్రవర్తి" అని బిరుదమిచ్చి గౌరవించినవారు అభినందనీయులు. ఈనాడు ఉభయాంధ్రరాష్ట్రాలలో ఎక్కడ అవధానము జరిగినా వీరిని ప్రాశ్నికులుగా పిలవటం పరిపాటి. ఈనాడు మీరు ఏ అవధానిని పలకరించినా వారి మాటలలో శంకరాభరణము ప్రసక్తి వస్తుంది. నేడు వీరి దగ్గఱ అవధానవిద్య నేర్చుకొని అవధానములు చేస్తున్న వారూ ఉన్నారు.
నేడు శంకరాభరణము ఒక సాహితీ బృహద్విద్యాలయం. అక్కడ ఉన్న సాహిత్యం ముందు తరాలకు కరదీపిక.
పద్యవిద్యలో అక్షరాలు దిద్దుకోవటం మొదలు సాహితీ పరిశోధన చేసి డాక్టరు పట్టా పుచ్చుకొనటానికి సరిపొయే పంట ఆ కవనక్షేత్రములో పండింది. ఇంకా పండుతూనే ఉంటుంది.
రండి. శంకరాభరణములో చేరండి.
పద్యము వ్రాయటం రాకపోతే నేర్చుకోవచ్చు.
పద్యము వ్రాయటం వస్తే మెఱుగులు దిద్దుకోవచ్చు.
పద్యకవీశ్వరులైతే మీ కవిత్వముతో వర్ధిష్ణులకు మార్గదర్శనం చేయవచ్చు.
సీ. ఏగద్దె ఛందంబు నిచ్ఛతో నేర్వగా
భావించు వారికి పాఠశాల
యేవేది పద్యకవీశ్వరు లెల్లరు
ప్రత్యూషముఁ జను సభావిశేష
మేజాలపుం గూడు సాజముగ వధాన
విద్యార్థులకుఁ గల్పవృక్షశాఖ
యేతిన్నె ఆంధ్రభాషాతరుణి నిలచి
మంగళారతులందు మందిరమ్ము
తే.గీ. శోభ నట్టి ఠావును శంకరాభరణముఁ
బట్టుదలతో నెఱపుచున్న పండితవరు,
సత్కవిన్, స్థితప్రజ్ఞునిన్, సద్గురువును
కందిశంకరయ్యను గొల్తు! గారవింతు!!
12, జనవరి 2025, ఆదివారం
విన్నపం
కవిమిత్రులకు నమస్సులు
26-7-2008 నాడు నేను 'శంకరాభరణం' బ్లాగును ప్రారంభించాను. కాని 2-6-2010 నుండి సమస్యలను ఇవ్వడం ప్రారంభించాను.
ప్రారంభంలో వారంలో ఆరు రోజులు చిన్న సమస్యలు (జాత్యుపజాతులలో) ఇస్తూ, వారంతంలో (ఆదివారం నాడు) వృత్తసమస్యలిస్తూ ఉండేవాణ్ణి. 30-5-2016 నుండి ఒకే సంఖ్యతో రెండు సమస్యలు ఇవ్వడం ప్రారంభించాను. ఒకే భావంతో వృత్తంలో ఒక సమస్య... జాత్యుపజాతుల్లో ఒక సమస్య. ఉజ్జాయింపుగా లెక్క వేస్తే ఇప్పటికి దాదాపు 9000 సమస్యలు అయి ఉంటాయి.
ఈ సమస్యలలో నేను స్వయంగా సిద్ధం చేసినవి, మిత్రులు పంపినవి, వివిధ గ్రంథాలనుండి సేకరించినవి, అవధానాలలో ప్రాశ్నికులు అడిగినవి ఉన్నాయి. సాహితీ సమావేశాలకు వెళ్ళినప్పుడు కవిమిత్రులు తమ పుస్తకాలను ఇచ్చినప్పుడు వాటిని చదువుతూ వారి పద్యపాదాలలో నాకు సమస్యగా పనికి వచ్చేవి ఏమైన ఉన్నాయా అని వెదుక్కుంటూ ఉంటాను. వారి పద్యపాదాలలో ఒకటి, రెండు పదాలను మార్చి సమస్యలు సిద్ధం చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
చాలా కాలంగా మిత్రులు శంకరాభరణం సమస్యలతో ఒక పుస్తకాన్ని ప్రచురించుమని ప్రోత్సహిస్తూనే ఉన్నారు.
1000 సమస్యలు పూర్తయినపుడు పేజీకి ఒక సమస్య - దానికి వచ్చిన పూరణలలో ఎన్నుకున్న నాలుగు పూరణలు (వ్రాసిన కవుల పేర్లతో) చొప్పున ఒక పుస్తకం ముద్రించాలనుకున్నాను. ఆ పని జరుగలేదు.
3000 సమస్యలు పూర్తయినపుడు ఒక్కొక్క సమస్య - దానికి వచ్చిన పూరణలలో ఎన్నుకున్న ఒక పూరణ చొప్పున ఒక పుస్తకం వెలువరిస్తే బాగుంటుందనుకున్నాను. అదీ జరుగలేదు.
ఇప్పుడు 5000 సమస్యలయ్యాయి. నేను పైన చెప్పిన విధంగా అన్ని సమస్యా పాదాలను లెక్కిస్తే దాదాపు 9000 అవుతాయి.
ఇప్పుడు కేవలం సమస్యలు మాత్రమే ముద్రించాలని సంకల్పం. ఛందస్సుల వారీగా, సమస్యలను అక్షరక్రమంలో ఇస్తాను. బ్లాగు మొదలు పెట్టిన దగ్గర నుండి ఇప్పటి వాట్సప్ సమూహం వరకు పూరణలు వ్రాసిన వారి పట్టిక ఉంటుంది (ఒక్క పూరణ చెప్పినా, వేలాదిగా చెప్పినా అందరినీ అక్షరక్రమంలో అందులో ప్రకటిస్తాను), ఆటవెలది, తేటగీతి, కందం, ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం, ఇతర వృత్తాలు ఇలా ఛందాల వారీగా సమస్యలుంటాయి. అదికూడా అక్షరక్రమంలో.
ఇది 400 పైచిలుకు పేజీల పుస్తకం అవుతుంది. 500 పుస్తకాలు ముద్రించడానికి దాదాపు లక్ష రూపాయల వరకు కావచ్చు.
అయితే ఈ పుస్తకాన్ని వ్యక్తిగతంగా ముద్రించే స్తోమత నాకు లేదు. ఏదైనా సంస్థ పూనుకొని ముద్రిస్తే బాగుంటుంది కాని, ఏ సంస్థ ముందుకు వస్తుంది?
అందుకని శంకరాభరణం సభ్యుల నుండి, హితుల నుండి విరాళాలు సేకరించాలని మిత్రులు నిర్ణయించారు.
ఇది తప్పనిసరి కాదు. ఇష్టం ఉన్నవారు ఇవ్వవచ్చు, లేనివారు ఇవ్వకపోవచ్చు. బలవంతం లేదు... విజ్ఞాపన మాత్రమే.
ఇంత అని పరిమితి లేదు. ఎవరికి ఎంత ఇవ్వాలనిపిస్తే అంత... క్రింద పేర్కొన్న వివరాల ప్రకారం మా ఆవిడ అకౌంటుకు పంపవచ్చు. (నేను మిత్రుల పుస్తకాల ముద్రణలో వారికీ, ప్రెస్సు వాళ్ళకూ లావాదేవీలు నా అకౌంటుతో చేస్తున్నందున ఈ డబ్బులు కూడ అందులో చేరితే గజిబిజిగా ఉంటుందన్న కారణంగా నా నెం. ఇవ్వడం లేదు)
15 సంవత్సరాలుగా తమ పద్యాలను పంపుతూ, ఇంత వృద్ధాప్యంలోనూ నాలో ఉత్సాహాన్ని నింపుతూ ప్రోత్సహిస్తున్న కవిమిత్రులకు, సాహితీప్రియులకు సర్వదా కృతజ్ఞుడను.
మీ
కంది శంకరయ్య
విరాళాలను పంపవలసిన అకౌంటు వివరాలు...
PhonePe/Gpay : Kandi Shanthi 7702121376
లేదా.... క్రింది అకౌంటుకు పంపవచ్చు.
Kandi Shanthi
Acc.No. 62463173690
S.B.I. Pochamma maidan Br. Warangal
IFSC : SBIN0021108
సమస్య - 5001
13-1-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కచుని సుతునిఁ జంపెఁ గైటభారి”
(లేదా...)
“కచుని కుమారునిం దునిమెఁ గైటభవైరి గరమ్ము బ్రీతితో”
(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...)
11, జనవరి 2025, శనివారం
సమస్య - 5000
12-1-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వింతగను సమస్య లైదువేలయ్యె భళా”
(లేదా...)
“అవురా చూచుచునుండగా నయిదువేలయ్యెన్ సమస్యల్ భళా”
(నిజానికి ఒకే సమస్యను ఛందోవైవిధ్యంతో రెండు విధాలుగా ఇవ్వడం వల్ల పదివేలుగా లెక్కించాలి)
10, జనవరి 2025, శుక్రవారం
సమస్య - 4999
11-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మరలందున్ గనె భ్రమరము మకరందమ్మున్”
(లేదా...)
“మరలందున్ మకరంద మున్నదని సంభావించె షట్పాదముల్”
9, జనవరి 2025, గురువారం
సమస్య - 4998
10-1-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శ్రీవనితను బూజ సేసె శితికంఠుండే”
(లేదా...)
“శ్రీవనితానురక్తుఁడయి చేసెను బూజల ఫాలనేత్రుఁడే”
(అష్టావధాని బండకాడి అంజయ్య గౌడ్ గారికి ధన్యవాదాలతో...)
8, జనవరి 2025, బుధవారం
సమస్య - 4997
9-1-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దుగ్ధసాగరమందున ధూళి రేఁగె”
(లేదా...)
“దుగ్ధపయోధిమధ్యమున ధూళులు రేఁగెను చూడుమా హరీ!”
7, జనవరి 2025, మంగళవారం
సమస్య - 4996
8-1-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్వప్నంబునఁ గన్నదెల్ల సత్యంబయ్యెన్”
(లేదా...)
“స్వప్నంబందునఁ గాంచినట్టి దవురా సత్యంబుగా నిల్చెడిన్”
6, జనవరి 2025, సోమవారం
సమస్య - 4995
7-1-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పురుషునిఁ బురుషుండు గలియఁ బుత్రుఁడు గలిగెన్”
(లేదా...)
“పురుషుం డొక్కఁడు పూరుషుం గలియఁగన్ బుత్రుండు గల్గెన్ గదా”
5, జనవరి 2025, ఆదివారం
సమస్య - 4994
6-1-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గర్హింపం దగినవాఁడు గంగాధరుఁడే”
(లేదా...)
“గర్హింపం దగినట్టివాఁడు గద యా గంగాధరుం డెప్పుడున్”
4, జనవరి 2025, శనివారం
సమస్య - 4993
5-1-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఫలముఁ గోరువాఁడె పండితుండు”
(లేదా...)
“ఫలమునుఁ గోరువాఁడె కద పండితుఁడున్ సదసద్వివేకియున్”
(విట్టుబాబుకు ధన్యవాదాలతో...)
3, జనవరి 2025, శుక్రవారం
సమస్య - 4992
4-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఇంతలు గనులుండి మార్గమే కననైతిన్”
(లేదా...)
“ఇంతలు గన్నులుండి తెరువే కననైతిని మందభాగ్యుఁడన్”
2, జనవరి 2025, గురువారం
సమస్య - 4991
3-1-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాముఁడు పెండ్లాడె నొక్క రాక్షసకాంతన్”
(లేదా...)
“రాముఁడు పెండ్లియాడె నొక రాక్షసకాంతను మోహమగ్నుఁడై”
(బండకాడి అంజయ్య గౌడ్ గారి అష్టావధాన సమస్య)
1, జనవరి 2025, బుధవారం
సమస్య - 4990
2-1-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సూర్యబింబమ్ము శోభించె సుదతి నుదుట”
(లేదా...)
“ఇనబింబ మ్మలరారె నింతి నుదుటన్ హేలాలసద్భూషయై”