31, డిసెంబర్ 2023, ఆదివారం

సమస్య - 4632

1-1-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జారులు లేకున్న నగునె శాంతి సుఖంబుల్”
(లేదా...)
“జారులు లేనిచో భువిని శాంతిసుఖంబులు సంభవించునే”

30, డిసెంబర్ 2023, శనివారం

సమస్య - 4631

31-12-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కీచకుని శాంతిపర్వానఁ గ్రీడి సంపె”
(లేదా...)
“భారత శాంతిపర్వమునఁ బార్థుఁడు సంపెను కీచకాధమున్”

29, డిసెంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4630

30-12-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బకములఁ గని చేపలనుచు వ్రాసిరి సుకవుల్”
(లేదా...)
“బకములఁ జూచి చేపలని వ్రాసిరి కైతల లోన సత్కవుల్”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

28, డిసెంబర్ 2023, గురువారం

సమస్య - 4629

29-12-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బింబము లనేకములు ప్రతిబింబ మొకటె”
(లేదా...)
“వసుధన్ బింబము లెన్ని యున్నఁ బ్రతిబింబం బొక్కటే దోఁచెనే”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

27, డిసెంబర్ 2023, బుధవారం

సమస్య - 4628

28-12-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పెండ్లమునకు మ్రొక్కు పతికిఁ బెన్నిధు లబ్బున్”
(లేదా...)
“పెండ్లముఁ జేరి మ్రొక్కు పతి పెన్నిధులన్ గని పొందు సేమమున్”

26, డిసెంబర్ 2023, మంగళవారం

సమస్య - 4627

27-12-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కోరనిది దక్కు దక్కదు కోరి కొలువ”
(లేదా...)
“కోరిన దేది దక్కదఁటఁ గోరనిదే లభియించుఁ గొల్చినన్”
(శిష్ట్లా వేంకట లక్ష్మీ నరసింహ శర్మ గారికి ధన్యవాదాలతో...)

25, డిసెంబర్ 2023, సోమవారం

సమస్య - 4626

26-12-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ధర్మమూర్తులె కావింత్రు దారుణములు”
(లేదా...)
“ధర్మమూర్తు లొనర్తు రెప్పుడు దారుణంబగు కృత్యముల్”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

24, డిసెంబర్ 2023, ఆదివారం

సమస్య - 4625

25-12-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఉరగములు దంపతుల సెజ్జ నొప్పుచుండు”
(లేదా...)
“దంపతు లొక్కటైన తఱి దాపున నుండును కాలసర్పముల్”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

23, డిసెంబర్ 2023, శనివారం

సమస్య - 4624

24-12-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రణము లనేకంబులుగ వరంబు లగుఁ గదా”
(లేదా...)
“రణము లనేకముల్ గద వరంబులుగా లభియించు నిచ్చలున్”
(ఈ సమస్యను పంపిన శిష్ట్లా వేంకట నరసింహ శర్మ గారికి ధన్యవాదాలు)

22, డిసెంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4623

23-12-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... (ఛందో గోపనము)
“కుంజరము కుశాగ్రమున నిదుర చక్కగఁ బోయెన్”
(లేదా...)
“కుంజరము కుశాగ్ర భాగమునఁ జక్కగ నిద్దుర వోయెఁ జూడుమా”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

21, డిసెంబర్ 2023, గురువారం

సమస్య - 4622

22-12-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జ్ఞానసరస్వతినిఁ గొలువ జ్ఞానము దొలఁగున్”
(లేదా...)
“జ్ఞానము లుప్తమౌను గద జ్ఞానసరస్వతిఁ గొల్వ బాసరన్”
(రేపు బాసర క్షేత్రంలో జ్ఞానసరస్వతీ సన్నిధిలో ఉంటాను)

20, డిసెంబర్ 2023, బుధవారం

సమస్య - 4621

21-12-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తన సొగసు దయ్యముగఁ దోఁచె దర్పణమున”
(లేదా...)
“తన సౌందర్యము నద్దమందుఁ  గనినన్ దయ్యంబుగాఁ  దోఁచెనే”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

19, డిసెంబర్ 2023, మంగళవారం

సమస్య - 4620

20-12-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రమ్ము లరుణవర్ణ భీకరమ్ములు గనఁగన్”
(లేదా...)
“రమ్ములు రక్త వర్ణ రుచిరమ్ములు సర్వభయంకరమ్ములున్”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

18, డిసెంబర్ 2023, సోమవారం

సమస్య - 4619

19-12-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సింగము వెంట నడుచు నొక చిన్నది యెపుడున్”
(లేదా...)
“సింగము వెంట సాగు నొక చిన్నది నిత్యము నిర్భయమ్ముగన్”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

17, డిసెంబర్ 2023, ఆదివారం

సమస్య - 4618

18-12-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మయసభలోఁ గాఁచితివఁట  మానము సతికిన్”
(లేదా...)
“మయసభ యందుఁ గాఁచితివి మానిని మానము ధర్మమూర్తివై”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

16, డిసెంబర్ 2023, శనివారం

సమస్య - 4617

17-12-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“క్రూరమృగము లాకుకూరలఁ దిను”
(లేదా...)
“క్రూరమృగమ్ము లెప్పుడును గోరి తినున్ గద యాకుకూరలన్”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

15, డిసెంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4616

16-12-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్వర్గమం దప్సరలు పతివ్రతలె సుమ్ము”
(లేదా...)
“వాసిన్ గాంత్రు పతివ్రతా మణులుగా స్వర్గంబునం దప్సరల్”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

14, డిసెంబర్ 2023, గురువారం

సమస్య - 4615

15-12-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కనులకు వీనులకు విందు గద యుద్ధమ్మే”
(లేదా...)
“యుద్ధము నేత్ర పర్వముగ నుండును పిమ్మటఁ గర్ణపేయమౌ”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

13, డిసెంబర్ 2023, బుధవారం

సమస్య - 4614

14-12-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మృదులములు వజ్రముల్ పూలరేకుల వలె”
(లేదా...)
“లేఁత గులాబి రేకుల వలెన్ సుతిమెత్తగ నుండు వజ్రముల్”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

12, డిసెంబర్ 2023, మంగళవారం

సమస్య - 4613

13-12-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పరమాత్ముఁడు మూగవాడు పసిబాలుఁ డయో”
(లేదా...)
“బాలుఁడు మూగవాడు పసివాడు కదా పరమాత్ముఁ డెప్పుడున్”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

11, డిసెంబర్ 2023, సోమవారం

సమస్య - 4612

12-12-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శిలలుగా మారె శిల్పముల్ చిత్రగతిని”
(లేదా...)
“శిల్పంబుల్ శిలలయ్యె నయ్యెడ నహో చిత్రాతిచిత్రంబుగన్”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

10, డిసెంబర్ 2023, ఆదివారం

సమస్య - 4611

11-12-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుట్మలదంతికిఁ గలిగెను కోపము నాపై”
(లేదా...)
“కుట్మలదంతికిన్ గలిగెఁ గోపము నాపయి హేతు వెద్దియో”

(ఉప్పలధడియం భరతశర్మ అష్టావధానంలో ఈరోజు నేనిచ్చిన సమస్య)

9, డిసెంబర్ 2023, శనివారం

సమస్య - 4610

10-12-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కష్టమ్ములు దీరె ననుచుఁ గన్నీరిడిరే”
(లేదా...)
“కష్టములెల్లఁ దీరెనని కంటను నీరిడి రెల్లరయ్యెడన్”

8, డిసెంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4609

9-12-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అయ్యలకే కాని మీస మందఱ కేలా?”
(లేదా...)
“అయ్యల కొప్పుఁ గాని కన నందఱ కెందుకు కోఱమీసముల్”
(కవి చౌడప్పకు నమస్సులతో...)

7, డిసెంబర్ 2023, గురువారం

సమస్య - 4608

8-12-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె”
(లేదా...)
“అమృతము ప్రాణహానికర మందురు విజ్ఞులు ద్రాగఁ బోకుమా”

6, డిసెంబర్ 2023, బుధవారం

సమస్య - 4607

7-12-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అత్తకుఁ గను గీటె నల్లుఁ డౌర”
(లేదా...)
“అత్తకుఁ గన్ను గీటె నల యల్లుఁడు మామయె చూచి మెచ్చఁగన్”

5, డిసెంబర్ 2023, మంగళవారం

సమస్య - 4606

6-12-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలలు గల్లలైనఁ గలుగు ముదము”
(లేదా...)
“కలలవి కల్లలైనపుడె కల్గును మోద మెడంద శాంతిలున్”

4, డిసెంబర్ 2023, సోమవారం

సమస్య - 4605

5-12-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కమలాప్తుఁడు చంద్రుఁడన్నఁ గల్ల యెటులగున్”
(లేదా...)
“కమలాప్తుండు శశాంకుఁడౌట నిజమే కాదందువా సత్కవీ”

3, డిసెంబర్ 2023, ఆదివారం

సమస్య - 4604

4-12-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గెలిచినవాఁడేడ్చె నవ్వె గెలువనివాఁడున్”
(లేదా...)
“గెలిచినవాఁడు దుఃఖపడె గెల్వనివానికి దక్కె సౌఖ్యమున్”

2, డిసెంబర్ 2023, శనివారం

సమస్య - 4603

3-12-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అన్నా యని రాముఁ బిలిచె నవనిజ భక్తిన్”
(లేదా...)
“అన్నా యంచు ధరాత్మజాతయె యయోధ్యారాముఁ బిల్చెం దగన్”

1, డిసెంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4602

2-12-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చెనటులకున్ నిలయము గద చిత్తూరు గనన్”
(లేదా...)
“చెనటుల్ మాత్రమె వాసముందురు గదా చిత్తూరులో నెప్పుడున్”

(ఈరోజు చిత్తూరులో ఆముదాల మురళి గారి 'శతావధాన కౌముది' పుస్తకావిష్కరణలో పాల్గొన్నాను)

30, నవంబర్ 2023, గురువారం

సమస్య - 4601

1-12-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలమును త్యజియించి కనె సుకవిగ యశమ్మున్”
(లేదా...)
“కలమును వీడి సత్కవిగఁ గౌరవమందెను లోకమందునన్”

29, నవంబర్ 2023, బుధవారం

సమస్య - 4600

30-11-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అగ్ని నార్పవచ్చు నగ్నితోడ”
(లేదా...)
“అగ్నిని నగ్నితోడఁ దగ నార్పఁగవచ్చు నటంద్రు పండితుల్”

28, నవంబర్ 2023, మంగళవారం

సమస్య - 4599

29-11-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జారులు పూజింతురు తొలిజామున శౌరిన్”
(లేదా...)
“జారులు సేయకున్నఁ దొలిజామున శౌరికిఁ బూజ లేదుగా”
(ఆముదాల మురళి గారి అష్టావధానంలో దండిభొట్ల దత్తాత్రేయశర్మ గారిచ్చిన సమస్య)

27, నవంబర్ 2023, సోమవారం

సమస్య - 4598

28-11-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పట్టా లెక్కకయె రైలు పరువులు దీసెన్”
(లేదా...)
“పట్టాలెక్కక రైలు పర్వులిడె దుర్వారంపు వేగంబునన్”

26, నవంబర్ 2023, ఆదివారం

సమస్య - 4597

27-11-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పేరు లేనివాఁడె పెద్దదిక్కు”
(లేదా...)
“పేరెది లేనివాఁడె మన పెన్నిధి ప్రోవఁగఁ బెద్దదిక్కగున్”

25, నవంబర్ 2023, శనివారం

సమస్య - 4596

26-11-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాముని సత్కథను మొల్ల వ్రాయననెఁ గటా”
(లేదా...)
“రాముని గాథ నెన్నఁడును వ్రాయను పొమ్మనె మొల్ల యయ్యయో”

24, నవంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4595

25-11-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నిను నిను నిను నిన్ను నిన్ను నిను నిను నిన్నున్”
(లేదా...)
“నిను నిను నిన్ను నిన్ను నిను నిన్ను నినున్ నిను నిన్ను నిన్నునున్”
(పాత సమస్యే అనుకుంటాను)

23, నవంబర్ 2023, గురువారం

సమస్య - 4594

24-11-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తులువల మేల్వొగడవలె యథోచితరీతిన్”
(లేదా...)
“తులువ లొనర్చు మేలును యథోచితరీతిని మెచ్చగా వలెన్”

(అఖండయతిని పట్టించుకోకండి)

22, నవంబర్ 2023, బుధవారం

సమస్య - 4593

23-11-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చావే మనుజుల కొసంగు శాశ్వతసుఖమున్”
(లేదా...)
“చావే యిచ్చును మానవాళికిఁ బ్రశస్తంబైన సౌఖ్యమ్మునున్”

21, నవంబర్ 2023, మంగళవారం

సమస్య - 4592

22-11-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భాగవతమును పోతన వ్రాయలేదు"
(లేదా...)
"భాగవతమ్మునున్ సుకవి వర్యుఁడు పోతన వ్రాయలేదు పో"

20, నవంబర్ 2023, సోమవారం

సమస్య - 4591

21-11-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామునిఁ బెండ్లాడెను బలరామానుజయే”
(లేదా...)
“రాముని కేలుఁ బట్టె బలరాముని సోదరి ధర్మపత్నియై”
(ఇచ్ఛాపురం అష్టావధానంలో ఆముదాల మురళి గారు పూరించిన సమస్య)

19, నవంబర్ 2023, ఆదివారం

సమస్య - 4590

20-11-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కారము నిడి చల్లఁబఱచెఁ గన్నుల నెల్లన్”
(లేదా...)
“కారము వెట్టి యందఱకుఁ గన్నులు చల్లగఁ జేసి రెంతయున్”
(మరికల్ అష్టావధానంలో ఆముదాల మురళి గారు పూరించిన సమస్య)

18, నవంబర్ 2023, శనివారం

సమస్య - 4589

19-11-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సాధన సేయంగవలదు ఛాత్రులు విద్యన్”
(లేదా...)
“సాధన సేయఁగా వలదు ఛాత్రులు విద్య గడించువేళలో”

17, నవంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4588

18-11-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గిల్లెను రావణుఁ డవనిజఁ గ్రీగంటఁ గనెన్”
(లేదా...)
“గిల్లెన్ సీతను రావణాసురుఁడు దాఁ గ్రీగంట వీక్షించుచున్”
(ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక నుండి)

16, నవంబర్ 2023, గురువారం

సమస్య - 4587

17-11-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సింహముపై వచ్చి శివుఁడు సీతను బట్టెన్”
(లేదా...)
“సింహముపైన వచ్చి వెస సీతనుఁ బట్టె శివుండు వింతగన్”
(తిరుపతి అష్టావధానంలో ఆముదాల మురళి గారు పూరించిన సమస్య)

15, నవంబర్ 2023, బుధవారం

దత్తపది - 205

16-11-2023 (గురువారం)
కవిమిత్రులారా,
అసి - కసి - పసి - మసి
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
సూర్యోదయ వర్ణనను స్వేచ్ఛాఛందంలో చేయండి.

14, నవంబర్ 2023, మంగళవారం

సమస్య - 4586

15-11-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పువ్వులందుఁ గనుము పుట్టె నగ్ని”
(లేదా...)
“పువ్వులలోనఁ దీవ్రముగఁ బుట్టిన దగ్ని యెదన్ రగుల్చుచున్”

13, నవంబర్ 2023, సోమవారం

సమస్య - 4585

14-11-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భారతము స్వర్గమన దేశభక్తుఁ డగున?”
(లేదా...)
“భారతభూమి స్వర్గమని వాకొనువాఁడెటు దేశభక్తుఁడౌ?”
(ఆముదాల మురళి గారికి ధన్యవాదాలతో...)

12, నవంబర్ 2023, ఆదివారం

సమస్య - 4584

13-11-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కిరణమ్మే దారి దప్పఁ గీలకము గదా”
(లేదా...)
“కిరణము మాత్రమే మనకుఁ గీలకమైనది దారి దప్పఁగన్”
(ఒంగోలు అష్టావధానంలో ఆముదాల మురళి గారు పూరించిన సమస్య)

11, నవంబర్ 2023, శనివారం

సమస్య - 4583

12-11-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బెల్లము చేదంటి వినిన పెద్దలు మెచ్చన్”
(లేదా...)
“బెల్లము చేదనన్ వినిన పెద్దలు మెచ్చిరి నా రసజ్ఞతన్”

10, నవంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4582

11-11-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వెలుఁగుఁ గోరి యార్పుము దీపములను వేగ”
(లేదా...)
“వెలుఁగును గోరి దీపముల వేగమె యార్పుట యుక్తకార్యమౌ”

9, నవంబర్ 2023, గురువారం

సమస్య - 4581

10-11-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పామును ముద్దాడి శిశువు పక్కున నవ్వెన్”
(లేదా...)
“పామును ముద్దు బెట్టుకొని పక్కున నవ్వెను బాలుఁ డత్తఱిన్”

8, నవంబర్ 2023, బుధవారం

సమస్య - 4580

9-11-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శివనామముఁ దలఁపఁ దగున శ్రీశైలమునన్”
(లేదా...)
“శివనామస్మరణమ్ము సేయఁ దగునా శ్రీశైలమం దెప్పుడున్”

7, నవంబర్ 2023, మంగళవారం

దత్తపది - 205

8-11-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
క్రికెట్టు - టెన్నిసు - పోలో - హాకీ
పై పదాలను ప్రయోగిస్తూ
మహాభారతాంశంపై
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

6, నవంబర్ 2023, సోమవారం

సమస్య - 4579

7-11-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వేకువ వినిపించు జోల వీనులవిందౌ”
(లేదా...)
“వేకువ జామునందు శ్రుతిపేయమగున్ గద జోలపాటయే”

5, నవంబర్ 2023, ఆదివారం

సమస్య - 4578

6-11-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శిష్టులకు ధూర్తచర్యయె శ్రేష్ఠమగును”
(లేదా...)
“చెల్లును ధూర్తవర్తనము శిష్టులకున్ సభలందు శ్రేష్ఠమై”

4, నవంబర్ 2023, శనివారం

సమస్య - 4577

5-11-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అంధుఁడా కాఁడు గనఁడు వర్ణాంతరముల”
(లేదా...)
“అంధుఁడు గాఁడు వర్ణముల యంతర మింతయుఁ గానలేఁ డయో”

3, నవంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4576

4-11-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జలముఁ గ్రోలినంతఁ జచ్చు నదియె”
(లేదా...)
“జలమును గ్రోలినంతటనె చచ్చుఁ గదా యది దాని తత్త్వమౌ”

2, నవంబర్ 2023, గురువారం

సమస్య - 4575

3-11-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చదువే నశియింపఁజేయ శస్త్రములేలా?”
(లేదా...)
“చదువే మూలము సర్వనాశమునకై శస్త్రాదులింకేలొకో?”
(మైలవరపు మురళీకృష్ణ గారి సమస్య)

1, నవంబర్ 2023, బుధవారం

సమస్య - 4574

2-11-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శ్మశ్రువు గడు శోభఁ గూర్చెఁ జక్కని సతికిన్”
(లేదా...)
“శ్మశ్రువు  సుందరంబు గద జక్కని భామ కపోలమందునన్”
(నేమాని లక్ష్మీనరసింహ సోమయాజులు  గారికి ధన్యవాదాలతో...)

31, అక్టోబర్ 2023, మంగళవారం

న్యస్తాక్షరి - 85

1-11-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
అంశం - కాశీ ప్రాశస్త్యం
ఛందం - ఉత్పలమాల
న్యస్తాక్షరాలు - 1వ పాదం 1వ అక్షరం 'వా'; 2వ పాదం 2వ అక్షరం 'ర'; 

3వ పాదం 10వ అక్షరం 'ణా'; 4వ పాదం 19వ అక్షరం 'సి'
(లేదా...)
'వా-ర-ణా-సి' అనే అక్షరాలు పాదాదిలో ఉండే విధంగా ఆటవెలది వ్రాయండి.

30, అక్టోబర్ 2023, సోమవారం

సమస్య - 4573

31-10-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మన్ననఁ బొందునొకొ మనుజమాత్రుఁడు గుణియై”
(లేదా...)
“మన్ననఁ బొందునే మనుజమాత్రుఁడు సద్గుణపూర్ణుఁడైనచో”

29, అక్టోబర్ 2023, ఆదివారం

సమస్య - 4572

30-10-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“త్రొక్కి చంపఁడు కుంభకర్ణుఁడు గపిశను” (కపిశ = చీమ)
(లేదా...)
“చావం ద్రొక్కఁడు కుంభకర్ణుఁ డెపుడున్ సచ్ఛీలుఁడై చీమనున్”

28, అక్టోబర్ 2023, శనివారం

సమస్య - 4571

29-10-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వన్నెలు మార్చెను రవి శశివలెఁ బ్రాగ్వీథిన్”
(లేదా...)
“వన్నెల్ మార్చెను భాస్కరుండు శశియై ప్రాక్పర్వతాగ్రంబుపై”

27, అక్టోబర్ 2023, శుక్రవారం

సమస్య - 4570

28-10-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కారముఁ గనక యొనరిచె వికారపుఁ జేష్టల్”
(లేదా...)
“కారము నిచ్చగింపక వికారపుఁ జేష్ట లొనర్చె మందుఁడున్”

26, అక్టోబర్ 2023, గురువారం

సమస్య - 4569

27-10-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వీలగునొకొ తృణముఁ గొనఁగ వేవేలిడినన్”
(లేదా...)
“కొంద మటన్న వీలగునొకో తృణముం బదిలక్షలిచ్చినన్”

25, అక్టోబర్ 2023, బుధవారం

సమస్య - 4568

26-10-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శిల యయ్యె నహల్యనుఁ గని శ్రీరాముఁ డయో”
(లేదా...)
“శిలగా నయ్యె నహల్యనుం గని వనిన్ శ్రీరామచంద్రుం డయో”

24, అక్టోబర్ 2023, మంగళవారం

దత్తపది - 204

25-10-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
కృత్యము - నిత్యము - ముత్యము - సత్యము
పై పదాలను ప్రయోగిస్తూ
ఆదర్శ పురుషుడెలా ఉండాలో వివరిస్తూ
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

23, అక్టోబర్ 2023, సోమవారం

సమస్య - 4567

24-10-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ప్రొద్దుటూరున రాతిరి ప్రొద్దు వొడిచె”
(లేదా...)
“పొడిచెను ప్రొద్దుటూరున నభోమణి రాతిరి దివ్యకాంతులన్”

22, అక్టోబర్ 2023, ఆదివారం

సమస్య - 4566

23-10-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“లలితాలంకారము లవలక్షణములగున్”
(లేదా...)
“లలితములౌ నలంకృతులు లక్షణదూరములౌను కైతలో”

21, అక్టోబర్ 2023, శనివారం

సమస్య - 4565

22-10-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కవులు ధర్మనాశకులు సంఘమ్మునందు”
(లేదా...)
“కవులన ధర్మనాశకులు గారె సమాజమునందుఁ జూడఁగన్”

20, అక్టోబర్ 2023, శుక్రవారం

సమస్య - 4564

21-10-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శాంతుఁ డఖిలసద్గుణుఁడు కీచకుఁడు సుమ్ము”
(లేదా...)
“శాంతుఁ డమత్సరుండు గుణశాలి దయామతి కీచకుం డగున్”

19, అక్టోబర్ 2023, గురువారం

సమస్య - 4563

20-10-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రసికు లొప్పని పద్యమే రమ్యమనిరి”
(లేదా...)
“రసికుల్ మెచ్చని పద్యమే నిలిచె సర్వశ్రేష్ఠమై వింతగన్”

18, అక్టోబర్ 2023, బుధవారం

సమస్య - 4562

19-10-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మదికి ముదము గలిగిన దవమానము సేయన్”
(లేదా...)
“మది ముదమందఁ జేసి రవమాన మొనర్చి సభాంగణమ్మునన్”

17, అక్టోబర్ 2023, మంగళవారం

సమస్య - 4561

18-10-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కష్టమూలమ్ము గాదె రాఘవుని పూజ”
(లేదా...)
“మూలం బయ్యెను గష్టసంతతికి రామున్ నమ్మి పూజించుటే”

16, అక్టోబర్ 2023, సోమవారం

సమస్య - 4560

17-10-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పదుగురాడు మాట పాడి గాదు”
(లేదా...)
“పదుగురు పల్కు మాట యెటు పాడియగున్ దలపోసి చూచినన్”

15, అక్టోబర్ 2023, ఆదివారం

సమస్య - 4559

16-10-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అవధానముఁ జేయువార లల్పులె కనఁగన్”
(లేదా...)
“అవధాన మ్మొనరించు వార లకటా యల్పుల్ గదా చూడఁగన్”

14, అక్టోబర్ 2023, శనివారం

సమస్య - 4558

15-10-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మోసగించిన జనులకుఁ బుణ్యమబ్బు”
(లేదా...)
“మోసముఁ జేయు వారలకు పుణ్యము దక్కును శాశ్వతంబుగన్”

13, అక్టోబర్ 2023, శుక్రవారం

సమస్య - 4557

14-10-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నిప్పు ప్రజ్వరిల్లు నీటిచేత”
(లేదా...)
“నిప్పులు ప్రజ్వరిల్లుఁ గద నీటినిఁ గుండెఁడు గ్రుమ్మరించినన్”

12, అక్టోబర్ 2023, గురువారం

సమస్య - 4556

13-10-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మనుజున కొక భార్య మంచిదగునె”
(లేదా...)
“మనుజున కొక్క భార్య యన మంచిది కాదని యంద్రు పండితుల్”

11, అక్టోబర్ 2023, బుధవారం

సమస్య - 4555

12-10-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అవినీతికి నాటపట్టు లయ్యెను గుడులే”
(లేదా...)
“నెలకొనె నాలయమ్ము లవినీతికిఁ జూడఁగ నాటపట్టులై”

10, అక్టోబర్ 2023, మంగళవారం

దత్తపది - 203

11-10-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
బెండ - బీర - దోస - కాకర
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
మహాభారతార్థంలో మీకు నచ్చిన ఛందంలో
పద్యం వ్రాయండి.

9, అక్టోబర్ 2023, సోమవారం

సమస్య - 4554

10-10-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్తవముం జేయంగనొప్పు సత్కృతికి ఖలున్”
(లేదా...)
“స్తవముం జేయగనొప్పు ధూర్తుని ఖలున్ సత్కారసంసిద్ధికిన్”
(విట్టుబాబు గారికి ధన్యవాదాలతో...)

8, అక్టోబర్ 2023, ఆదివారం

సమస్య - 4553

9-10-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సుజనులతో మైత్రి మిగుల క్షోభను గూర్చున్”
(లేదా...)
“సుజనులతోడి మైత్రి కడు క్షోభను గూర్చునటంద్రు విజ్ఞులే”

7, అక్టోబర్ 2023, శనివారం

విన్నపం

 కవిమిత్రులకు నమస్సులు.

కొద్ది రోజులుగా మీ పద్యాలను సమీక్షించలేకపోతున్నాను. ప్రతిరోజు సమస్యను షెడ్యుల్ చేయడంలో ఇబ్బంది లేదు. కాని మీ పద్యాలను చదివి స్పందించాలంటే 'గూగుల్ తో సైన్ ఇన్' చేయండి అంటున్నది. దానిని ఎన్నిసార్లు క్లిక్ చేసినా సైన్ ఇన్ చేయలేకపోతున్నాను. అందువల్ల మీ పద్యాలను సమీక్షించడానికి అవకాశం లేకుండా పోతున్నది. మిత్రులలో ఎవరైనా ఈ సాంకేతికమైన ఆటంకానికి పరిష్కారం చూపగలరా? 

సెల్ ఫోన్ లో ఇబ్బంది లేదు. వ్యాఖ్యలు పెట్టగలను. కాని సెల్ ఫోన్ లో టైప్ చేయాలంటే నాకు కష్టం..

సమస్య - 4552

8-10-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దుస్ససేను భీముఁడు గని తొలఁగె నడలి”
(లేదా...)
“తొలఁగెన్ భీముఁడు భీతితో రణమునన్ దుశ్శాసనున్ గాంచుచున్”

6, అక్టోబర్ 2023, శుక్రవారం

సమస్య - 4551

7-10-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కరమె యుద్ధరించె ధరణి నెపుడొ”
(లేదా...)
“కరమే ధారుణి నుద్ధరించె నెపుడో గంగాధరా! శంకరా!”

5, అక్టోబర్ 2023, గురువారం

సమస్య - 4550

6-10-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పీనుఁగను రమించి జాణ పిల్లలఁ బడసెన్”
(లేదా...)
“పీనుఁగనుం రమించి కడుఁ బిల్లలఁ బొందెను జాణ వింతగన్”
(గన్నమరాజు గిరిజామనోహర్ బాబు గారికి ధన్యవాదాలతో...)

4, అక్టోబర్ 2023, బుధవారం

నిషిద్ధాక్షరి - 56

5-10-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఏదైనా దైవస్తుతి పద్యాన్ని మీకు నచ్చిన ఛందంలో వ్రాయండి
నిషిద్ధాక్షరాలు - ఇ, ఈ అనే అచ్చులు, ఈ అచ్చులతో కూడిన హల్లులు

3, అక్టోబర్ 2023, మంగళవారం

సమస్య - 4549

4-10-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పెన్ను కొనెడువాఁడు వెఱ్ఱివాఁడు”
(లేదా...)
“పెన్ను కొనంగ సిద్ధపడ వెఱ్ఱితనంబె యగున్ దలంచినన్”

2, అక్టోబర్ 2023, సోమవారం

సమస్య - 4548

3-10-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బ్రహ్మచారికి నిద్దఱు భార్యలంట”
(లేదా...)
“ఇతఁడొక బ్రహ్మచారి యఁట యిద్దఱు భార్యల భర్త సూడఁగన్”

1, అక్టోబర్ 2023, ఆదివారం

సమస్య - 4547

2-10-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సీతావల్లభుఁడు చంద్రశేఖరుఁ డయ్యెన్”
(లేదా...)
“సీత మగండు చూడ శశిశేఖరుఁడయ్యె జనుల్ స్తుతింపఁగన్”

30, సెప్టెంబర్ 2023, శనివారం

సమస్య - 4546

1-10-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తిరుమల లడ్డు గడు చేదు తినవలదయ్యా”
(లేదా...)
“తిరుమలలోని లడ్డు గడుఁ దిక్తము నీవు దినంగవద్దయా”

29, సెప్టెంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4545

30-9-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పడక వీడి రమ్మన మంచి వార్త సతికి”
(లేదా...)
“శయ్యను వీడి రమ్మనుటె చల్లని వార్త యగున్ లతాంగికిన్”

28, సెప్టెంబర్ 2023, గురువారం

సమస్య - 4544

29-9-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వ్యామోహము లేని నరుఁడు యశముం గనునే”
(లేదా...)
“యశముం బొందఁగ శక్యమే నరునకున్ వ్యామోహమే లేనిచో”
(విట్టుబాబుకు ధన్యవాదాలతో...)

27, సెప్టెంబర్ 2023, బుధవారం

సమస్య - 4543

28-9-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మదరాసున కెంత దవ్వు మామా చెన్నై”
(లేదా...)
“నయమొప్పన్ మదరాసు పట్టణము చెన్నై కెంత దవ్వో కదా”

26, సెప్టెంబర్ 2023, మంగళవారం

దత్తపది - 202

27-9-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
"ఆట - పాట - బాట - మాట"
పై పదలతో వినాయక నిమజ్జనోత్సవాన్ని వర్ణిస్తూ
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

25, సెప్టెంబర్ 2023, సోమవారం

సమస్య - 4542

26-9-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ద్వైతము విడక చేసె నద్వైతబోధ”
(లేదా...)
“ద్వైతభ్రాంతి నివృత్తి యెందుకొఱ కద్వైతమ్ము బోధింపఁగన్”

24, సెప్టెంబర్ 2023, ఆదివారం

సమస్య - 4541

25-9-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాతికి రత్నమ్ము రమణి ప్రాప్తంబయ్యెన్”
(లేదా...)
“రాతికి రత్నమున్ రమణి ప్రాభవమొప్పఁగ లభ్యమయ్యెఁ బో”
(వేలూరి శివరామశాస్త్రి గారి శతావధాన సమస్య)

23, సెప్టెంబర్ 2023, శనివారం

సమస్య - 4540

24-9-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జనులు వొగడరె ముక్కుఁ గోసిన పడఁతిని”
(లేదా...)
“జనులు మనోజ్ఞరూపమని సన్నుతి సేయరె ముక్కుఁ గోసినన్”

22, సెప్టెంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4539

23-9-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తరతమభావమ్ముఁ జూచి దానమిడవలెన్”
(లేదా...)
“తరతమభావముం గని వదాన్యులు దానమొసంగ యుక్తమౌ”

21, సెప్టెంబర్ 2023, గురువారం

సమస్య - 4538

22-9-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వాతము లేకున్నఁ దనువు వ్రయ్యలు గాదా”
(లేదా...)
“వాతము లేనిచోఁ దనువు వ్రయ్యలగున్ గద వెజ్జు సంగతిన్”
(వేలూరి శివరామశాస్త్రి గారి శతావధాన సమస్య)

20, సెప్టెంబర్ 2023, బుధవారం

సమస్య - 4537

21-9-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నిద్రాభంగమ్ము మేలునే కలిగించెన్”
(లేదా...)
“నిద్రాభంగముఁ జేసినారు గద యెంతేన్ మేలుఁ జేకూర్చగన్”

19, సెప్టెంబర్ 2023, మంగళవారం

సమస్య - 4536

20-9-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గిరి హరిఁ గని పక్కుమని నగెన్ దరుశాఖన్”
(లేదా...)
“గిరి హరిఁ గాంచి పక్కున నగెన్ దరుశాఖలలోన డాఁగి తాన్”
(వేలూరి శివరామశాస్త్రి గారి శతావధాన సమస్య)

18, సెప్టెంబర్ 2023, సోమవారం

సమస్య - 4535

19-9-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ముక్తికిఁ గారణము విషయభుక్తియె తలఁపన్”
(లేదా...)
“ముక్తికి హేతువౌ విషయభుక్తియె భూషణ మెల్లవారికిన్”
(కడిమెళ్ళ వారి శతావధానంలో ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి సమస్య)

17, సెప్టెంబర్ 2023, ఆదివారం

సమస్య - 4534

18-9-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నగధారి యనంగుఁ ద్రుంచి నాతినిఁ బ్రోచెన్”
(లేదా...)
“నగధరుఁ డా సుమాంబకుని నాశ మొనర్చియుఁ బ్రోచె నాతినిన్”
(కడిమెళ్ళ వారి శతావధానంలో కె. రాజన్న శాస్త్రి గారి సమస్య)

16, సెప్టెంబర్ 2023, శనివారం

సమస్య - 4533

17-9-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కవులు చెఱచువారు లోకకళ్యాణమ్మున్”
(లేదా...)
“కవులెల్లం గడు దుష్టచిత్తులు జగత్కళ్యాణవిధ్వంసకుల్”

15, సెప్టెంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4532

16-9-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పిల్లి సింహము నోడించె విపినమందు”
(లేదా...)
“గెలిచె బిడాల ముద్ధతినిఁ గేసరితో వనిఁ బోరొనర్చియున్”

14, సెప్టెంబర్ 2023, గురువారం

సమస్య - 4531

15-9-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కనక యోగ్యతన్ వరమిచ్చు గరళగళుఁడు”
(లేదా...)
“యోగ్యతఁ జూడకుండ వరమొయ్యన నిచ్చు శివుండు దేవుఁడా”

13, సెప్టెంబర్ 2023, బుధవారం

దత్తపది - 201

14-9-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ధార - ధారణ - ధైర్యము - ధిషణ
పై పదాలను ప్రయోగిస్తూ
అవి లేనివాడు చేసే అవధానం ఎలా ఉంటుందో
స్వేచ్ఛాచందంలో చెప్పండి.

12, సెప్టెంబర్ 2023, మంగళవారం

సమస్య - 4530

13-9-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విస్కి బాటిలును దెఱచె విష్ణుమూర్తి”
(లేదా...)
“విస్కీబాటిలు విష్ణుమూర్తి దెఱచెన్ విశ్వేశ్వరుం డూఁకొనన్”
(అయ్యగారి కోదండ రావు గారికి ధన్యవాదాలతో...)

11, సెప్టెంబర్ 2023, సోమవారం

సమస్య - 4529

12-9-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భాస కాళిదాసులు దెల్గువారలె కద”
(లేదా...)
“భాసుఁడుఁ గాళిదాసు మఱి భారవి యెంచఁగఁ దెల్గువారలే”
(అయ్యగారి కోదండ రావు గారికి ధన్యవాదాలతో...)

10, సెప్టెంబర్ 2023, ఆదివారం

సమస్య - 4528

11-9-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దారులం గొట్టి  బ్రతుకుటే తగిన వృత్తి”
(లేదా...)
“దారుల్ గొట్టి గడించువారలదె సద్వ్యాపారమం చెంచెదన్”

9, సెప్టెంబర్ 2023, శనివారం

సమస్య - 4527

10-9-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలుషిత జల మందఁజేయుఁ గద స్వాస్థ్యమ్మున్”
(లేదా...)
“కలుషితమైన నీర మిడుఁ గాదె జనాళికి స్వాస్థ్యమెప్పుడున్”

(మంచినీళ్ళ సరస్వతీ రామశర్మ గారికి ధన్యవాదాలతో...)

8, సెప్టెంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4526

9-9-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మన్నుఁ దిన్నవాఁడు మాన్యుఁడయ్యె"
(లేదా...)
"మన్నుఁ దిన్న కొంటెవాఁడు మాన్యుఁడై నుతుల్ గొనెన్"
(మాత గంగాభవానీ శాంకరీ దేవి గారికి ధన్యవాదాలతో...)

7, సెప్టెంబర్ 2023, గురువారం

సమస్య - 4525

8-9-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గుణవిచారణ ద్వైతమగునొకొ గురుఁడ”
(లేదా...)
“సగుణము నిర్గుణంబని విచారణ సేయుటె ద్వైతమౌనొకో”

6, సెప్టెంబర్ 2023, బుధవారం

న్యస్తాక్షరి - 84

7-9-2023 (గురువారం)
కవిమిత్రులారా,
అంశం - గీతాచార్యుడు శ్రీకృష్ణుని స్తుతి
వృత్తం - చంపకమాల
1వపాదం 1వ అక్షరం 'గు'
2వ పాదం 2వ అక్షరం 'రు'
3వ పాదం 11వ అక్షరం 'దే'
4వ పాదం 13వ అక్షరం 'వ'

లేదా...
పై న్యస్తాక్షరాలను యతిస్థానంలో నిల్పుతూ
తేటగీతి పద్యం వ్రాయండి.

5, సెప్టెంబర్ 2023, మంగళవారం

సమస్య - 4524

6-9-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వర్షము మేల్గూర్చె ముంచి పంటలనెల్లన్”
(లేదా...)
“వర్షము మేలుఁ గూర్చినది పంటల నెల్లను ముంచివేయుటన్”

(ఈరోజంతా మా వరంగల్లులో వర్షం కురుస్తూనే ఉన్నది)

4, సెప్టెంబర్ 2023, సోమవారం

సమస్య - 4523

5-9-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తప్పులం జెప్పువాఁ డుపాధ్యాయుఁ డనఁగ”
(లేదా...)
“తప్పుల్ సెప్పు వివేకహీనుఁడె యుపాధ్యాయుండు ముమ్మాటికిన్”

3, సెప్టెంబర్ 2023, ఆదివారం

సమస్య - 4522

4-9-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కందములోఁ బ్రాసయతులు గడు యుక్తమగున్”
(లేదా...)
“ఉత్పలమాలలోనఁ గడు యుక్తము ప్రాసయతిప్రయోగమే”

2, సెప్టెంబర్ 2023, శనివారం

సమస్య - 4521

3-9-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చాలును చాలునిఁకఁ జాలు చాలును చాలున్”
(లేదా...)
“చాలును చాలుఁ జాలునిఁకఁ జాలును చాలును చాలుఁ జాలులే”

1, సెప్టెంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4520

2-9-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“క్రూరజనులకు నిలయమ్ము గుంతకల్లు”
(లేదా...)
“క్రూరులు దుష్టకర్ములును గుత్సితులుందురు గుంతకల్లులో”

31, ఆగస్టు 2023, గురువారం

సమస్య - 4519

1-9-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మోస మొనరించు వారలే పూజ్యజనులు”
(లేదా...)
“మోస మొనర్చువారలనె పూజ్యులుగా నుతియింతు రెల్లరున్”

30, ఆగస్టు 2023, బుధవారం

దత్తపది - 200

31-8-2023 (గురువారం)
కవిమిత్రులారా,
వేంకట - సుబ్బ - సహ - దేవుఁడు
పై పద్యాలతో వధూ వరులను ఆశీర్వదిస్తూ
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.
(31-8-2023 రోజున గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారి కుమారుడు చి. శరత్ చంద్ర వివాహం 

చి.సౌ. సాయిసంధ్యతో గుంతకల్లులో జరుగుతున్న సందర్భంగా)


29, ఆగస్టు 2023, మంగళవారం

సమస్య - 4518

30-8-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వాగ్దృగలభ్యుండు సేరెఁ బ్రాదయ్యములన్”
(లేదా...)
“వాగ్దృగలభ్యుఁడై యసురపక్షముఁ జేరె మురారి ప్రీతితో”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో బందరు దుర్గాప్రసాద్ గారి సమస్య)

28, ఆగస్టు 2023, సోమవారం

సమస్య - 4517

29-8-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పట్టెఁ జరవాణిఁ బుస్తకపాణి గనుఁడు”
(లేదా...)
“పుస్తకపాణి హస్తమున భూషణమై చరవాణి యొప్పెడిన్”

27, ఆగస్టు 2023, ఆదివారం

సమస్య - 4516

28-8-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మత్స్యము సింహముగఁ జంపె మత్తగజంబున్”
(లేదా...)
“మత్స్యము సింహమై చెలఁగి మత్తగజంబునుఁ గూల్చె నింగిపై”

(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో ఇప్పిలి వేణుగోపాల్ గారి సమస్య)

26, ఆగస్టు 2023, శనివారం

సమస్య - 4515

27-8-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పరపతి మేలనుచు సతులు వల్కుట సబబే”
(లేదా...)
“పరపతి మేలుమేలనుచు భామలు వల్కుట భావ్యమే కదా”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో రమణమూర్తి గారి సమస్య)

25, ఆగస్టు 2023, శుక్రవారం

సమస్య - 4514

26-8-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మీసమ్ములు దెల్లనయ్యె మీనాక్షి కయో”
(లేదా...)
“మీసంబుల్ గడుఁ దెల్లనయ్యెఁ గనుమా మీనాక్షికిన్ బాపురే”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో చంద్రశేఖర శర్మ గారి సమస్య)

24, ఆగస్టు 2023, గురువారం

సమస్య - 4513

25-8-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాట్నమ్మునుఁ ద్రిప్పి తాన్ స్వరాజ్యము పొందెన్”
(లేదా...)
“రాట్నముఁ ద్రిప్పి భారతి స్వరాజ్యము పొందె నదేమి చిత్రమో”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో కిలపర్తి దాలినాయుడు గారి సమస్య)

23, ఆగస్టు 2023, బుధవారం

సమస్య - 4512

24-8-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ముని కౌఁగిట సీత వ్రాలి పొందెను సుఖమున్”
(లేదా...)
“ముని పరిరంభ సౌఖ్యమును బొందెను జానకి పర్ణశాలలో”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో సమస్య)

22, ఆగస్టు 2023, మంగళవారం

సమస్య - 4511

23-8-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాకినిఁ గని మెచ్చి చేసెఁ గళ్యాణమ్మున్”
(లేదా...)
“కాకిని మెచ్చి పిల్చి తన కన్యనొసంగియుఁ బెండ్లిఁ జేసెనే”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో బొంతు సూర్యనారాయణ గారి సమస్య)

21, ఆగస్టు 2023, సోమవారం

సమస్య - 4510

22-8-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మా కరములు పదములు నియమమునఁ గొలువుమా”
(లేదా...)
“మా కరముల్ పదాలు నియమంబునఁ బట్టినవాఁడు ధన్యుఁడౌ”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో MPS సత్యనారాయణ గారి సమస్య)

20, ఆగస్టు 2023, ఆదివారం

సమస్య - 4509

21-8-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సత్కవి గాఁ డతఁడు పొందె సన్మానములన్”
(లేదా...)
“సత్కావ్యమ్ముల వ్రాయనట్టి కవికే సన్మాన సత్కారముల్”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో డా. పిలకా శాంతమ్మ గారి సమస్య)

19, ఆగస్టు 2023, శనివారం

సమస్య - 4508

20-8-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ధారణలో విఫలుఁడె యవధానముఁ జేసెన్”
(లేదా...)
“ధారణ సేయనేరఁ డవధాన మొనర్చెను మెచ్చి రెల్లరున్”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో నారాయణ మిత్ర గారి సమస్య)

18, ఆగస్టు 2023, శుక్రవారం

సమస్య - 4507

19-8-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శంకర సతియై జానకి సౌఖ్యముఁ గనె”
(లేదా...)
“శంకరు ధర్మపత్ని యగు జానకి గాంచె నమేయసౌఖ్యముల్”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో MSV గంగరాజు గారి సమస్య)

17, ఆగస్టు 2023, గురువారం

సమస్య - 4506

18-8-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సూర్యుఁ డుదయింపఁ దిమిరమ్ము చుట్టుముట్టె”
(లేదా...)
“రవి యుదయింపఁగాఁ దిమి పరంపర గ్రమ్మె ధరాతలమ్మునన్”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో పండి ఢిల్లీశ్ గారి సమస్య)

16, ఆగస్టు 2023, బుధవారం

సమస్య - 4505

17-8-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కంఠేకాలుండు పంక్తికంధరుఁ దాఁకెన్”
(లేదా...)
“కంఠేకాలుఁడు పంక్తికంధరుని వేగం దాఁకె నత్యుగ్రుఁడై”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో కుప్పిలి ఉమామహేశ్వర్ గారి సమస్య)

15, ఆగస్టు 2023, మంగళవారం

సమస్య - 4504

16-8-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ప్రవచనకర్తలు నటింత్రు భక్తవరులుగన్”
(లేదా...)
“ప్రవచనకర్త లెల్లరును భక్తులుగా నటియించువారలే”
(మొన్న శ్రీకాకుళం శతావధానంలో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి నేనిచ్చిన సమస్య)

14, ఆగస్టు 2023, సోమవారం

సమస్య - 4503

15-8-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హిందుదేశమున్ బిలువ రా దిండియ యని”
(లేదా...)
“హిందూదేశము నిండియా యనఁగ రా దింకేల దాస్యం బిటుల్”

13, ఆగస్టు 2023, ఆదివారం

సమస్య - 4502

14-8-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“లాయరుఁ గని భీతిఁ గని పలాయనమైతిన్”
(లేదా...)
“లాయరుఁ గాంచి భీతిలి పలాయనమంత్రమునుం బఠించితిన్”

12, ఆగస్టు 2023, శనివారం

సమస్య - 4501

13-8-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భత్యము లేనట్టి కొలువు వరసుఖము లిడున్”
(లేదా...)
“భత్యం బందని కొల్వుఁ జేసినపుడే ప్రాప్తించు సత్సౌఖ్యముల్”

11, ఆగస్టు 2023, శుక్రవారం

సమస్య - 4500

12-8-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కనకదుర్గ! ఖలులఁ గాచుమమ్మ”
(లేదా...)
“ఖలులం గాచుము సత్కృపన్ గనకదుర్గా నీకు దండం బిదే”

10, ఆగస్టు 2023, గురువారం

సమస్య - 4499

11-8-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రతి వెగటాయెను పడుచుకు రాతిరిపూటన్”
(లేదా...)
“రతి వెగటాయె నేటి కవురా జవరాలికి రాత్రి వేళలో”

9, ఆగస్టు 2023, బుధవారం

దత్తపది - 199

10-8-2023 (గురువారం)
కవిమిత్రులారా,
రోత - పాడు - చెడు - ఏవ
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
వేంకటేశ్వరుని దివ్యమంగళ రూపాన్ని వర్ణిస్తూ
స్వేచ్ఛాచందంలో పద్యం చెప్పండి.

8, ఆగస్టు 2023, మంగళవారం

సమస్య - 4498

9-8-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బొబ్బిలి యుద్ధమున నోడె బుస్సీ సేనల్”
(లేదా...)
“బొబ్బిలి యుద్ధరంగమున బుస్సి బలంబులె యోడె వింటివా”

7, ఆగస్టు 2023, సోమవారం

సమస్య - 4497

8-8-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దేవుఁడు లేనట్టి గుడియె తీర్చును గోర్కెల్”
(లేదా...)
“దేవుఁడు లేని దేవళమె తీర్చును భక్తుల కోర్కెలన్నియున్”

6, ఆగస్టు 2023, ఆదివారం

సమస్య - 4496

7-8-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామకథను జింతాకుపై వ్రాయఁ దగును”
(లేదా...)
“శ్రీరామాయణగాథ వ్రాయఁగఁ దగున్ జింతాకుపైఁ బూర్తిగన్”

5, ఆగస్టు 2023, శనివారం

సమస్య - 4495

6-8-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాంత లాదరణీయులు గారు నిజము”
(లేదా...)
“పడఁతుల నాదరింపకుఁడు పాడగు పచ్చని కాపురంబులే”
(పిరాట్ల వేంకట శివరామకృష్ణ గారికి ధన్యవాదాలతో)

4, ఆగస్టు 2023, శుక్రవారం

సమస్య - 4494

5-8-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నరుఁడు దేరుఁ ద్రిప్పఁగనె యుత్తరుఁడు దిట్టె”
(లేదా...)
“తిట్టె విరాటరాట్సుతుఁడు దేరు మరల్చుటచే బృహన్నలన్”

3, ఆగస్టు 2023, గురువారం

సమస్య - 4493

4-8-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వచ్చినట్టి ఫల్గుణుని గెల్వంగవచ్చు”
(లేదా...)
“వచ్చినవాఁడు ఫల్గుణుఁ డవశ్యము గెల్వఁగవచ్చు సైంధవా”

2, ఆగస్టు 2023, బుధవారం

సమస్య - 4492

3-8-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాయల కావ్యమ్మునఁ గనరావు రసమ్ముల్”
(లేదా...)
“రాయల కావ్యమందు గనరావు రసోచిత భావసంపదల్”

1, ఆగస్టు 2023, మంగళవారం

న్యస్తాక్షరి - 83

2-8-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
పాదాంతాక్షరాలుగా 'వ - వ - వ - వా' న్యస్తం చేస్తూ
శివుని స్తుతిస్తూ చంపకమాల (లేదా...) కందం వ్రాయండి.

31, జులై 2023, సోమవారం

సమస్య - 4491

1-8-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ధర్మవిరుద్ధమ్మె యగును తండ్రికి మ్రొక్కన్”
(లేదా...)
“ధర్మవిరుద్ధమౌను గద తండ్రికి సాగిలి మ్రొక్కు కార్యమే”

30, జులై 2023, ఆదివారం

సమస్య - 4490

31-7-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పిడికిలిలోనఁ గనుపించె విధుఁడును రవియున్”
(లేదా...)
“పిడికిలిలోనఁ గాంచితిని వింతగఁ జంద్ర దినేశ బింబముల్”

29, జులై 2023, శనివారం

సమస్య - 4488

30-7-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఆలు బిడ్డల విడుటె గార్హస్థ్యమగును"
(లేదా...)
"ఆలుంబిడ్డల వీడి యేగుటయె గార్హస్థ్యంబనున్ శాస్త్రముల్"

(పిరాట్ల వేంకట శివరామకృష్ణ గారికి ధన్యవాదాలతో...)

28, జులై 2023, శుక్రవారం

సమస్య - 4487

29-7-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సీసాలను మెచ్చిరి రససిద్ధికి లోకుల్”
(లేదా...)
“సీసాలం గడు మెచ్చి రెల్లరు రసాశేషోత్సుకత్వంబునన్”

27, జులై 2023, గురువారం

సమస్య - 4486

28-7-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అన్నవరములో లభియింప దన్నమయ్యొ”
(లేదా...)
“అన్నవరంబునం దకట యన్నము లభ్యము గాదు చిత్రమే”

26, జులై 2023, బుధవారం

దత్తపది - 199

26-7-2023 (బుధవారం)
కాకి - డేగ - నెమలి - కోడి
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో స్వేచ్ఛాఛందంలో
పద్యం వ్రాయండి.

25, జులై 2023, మంగళవారం

సమస్య - 4486

26-7-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చవట గద నినుం దలంప శంకరపత్నీ”
(లేదా...)
“చవట గదా నినుం దలప శంకరపత్ని గణేశ్వరాంబికా”

24, జులై 2023, సోమవారం

సమస్య - 4485

25-7-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మాటలలో తీపి యెటులొ మాన్యుల చేతల్”
(లేదా...)
“మాటల యందు తీపి గద మాన్యుల చేతలఁ జూడ నెట్టివో”
(తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదాలతో)

23, జులై 2023, ఆదివారం

సమస్య - 4484

24-7-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆదివారము పనిదిన మయ్యె నయ్యొ”
(లేదా...)
“పనిదినమయ్యె నయ్యొ రవివారము కాదని చెప్ప నొప్పునే”

22, జులై 2023, శనివారం

సమస్య - 4483

23-7-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఈగలు వడిన పానక మెంతొ మేలు”
(లేదా...)
“ఈగలు వడ్డ పానకమె యెంతొ హితంబొనగూర్చుఁ గ్రోలినన్”

21, జులై 2023, శుక్రవారం

సమస్య - 4482

22-7-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్నె”
(లేదా...)
“నిను నిన్నున్ నిను నిన్ను నిన్ను నిను నిన్నే కాక యింకెవ్వనిన్”

20, జులై 2023, గురువారం

సమస్య - 4481

21-7-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఏ గురుఁడు గనిపెట్టె యడాగమముల”
(లేదా...)
“ఔర యడాగమంబులు నుగాగమముల్ గనిపెట్టి రెవ్వరో”

19, జులై 2023, బుధవారం

సమస్య - 4480

20-7-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మద్యముఁ గొని వ్రాయనగును మంజుల కవితల్”
(లేదా...)
“మద్యముఁ గ్రోలినంత రసమంజుల పద్యము వ్రాయగా నగున్”
(బస్వోజు సుధాకరాచారి గారికి ధన్యవాదాలతో)

18, జులై 2023, మంగళవారం

న్యస్తాక్షరి - 82

19-7-2023 (బుధవారం)
విషయం - కుంభవృష్టి
ఛందం - ఉత్పలమాల
1వ పాదం 1వ అక్షరం 'శ్రా'; 2వ పాదం 2వ అక్షరం 'వ';
3వ పాదం 11వ అక్షరం 'ణ'; 4వ పాదం 10వ అక్షరం 'ము'
లేదా...
'శ్రా-వ-ణ-ము' ఆద్యక్షరాలుగా ఆటవెలది వ్రాయండి.

17, జులై 2023, సోమవారం

సమస్య - 4479

18-7-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దారము లేనట్టి దండ దగు సుందరమై”
(లేదా...)
“దారము లేని దండ వనితా కనువిందొనఁగూర్చెఁ జూడుమా”

16, జులై 2023, ఆదివారం

సమస్య - 4478

17-7-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జన్మదినోత్సవపు వేడ్క జరుపుట మేలా”
(లేదా...)
“జన్మదినోత్సవంబనుచు సంబరముల్ జరుపంగ మేలొకో”
(జులై 17 నా పుట్టినరోజు)

15, జులై 2023, శనివారం

సమస్య - 4477

16-7-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రసభంగమె యగును పెక్కు రమణులు సేరన్”
(లేదా...)
“భోరునఁ గాంతలెల్లఁ జొరఁబూనినచో రసభంగమే కదా”
(రామరాజ భూషణుని పద్యపాదానికి చిన్న మార్పు)

14, జులై 2023, శుక్రవారం

సమస్య - 4476

15-7-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఫలితముండదు పూర్వకావ్యములఁ జదువ”
(లేదా...)
“ఫలితము లేదు పూర్వకవివర్యుల కావ్యములం బఠించినన్”

13, జులై 2023, గురువారం

సమస్య - 4475

14-7-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మెచ్చరొ కొనియాడఁ బోరొ మేలనరొ కవిన్”
(లేదా...)
“మెచ్చరొ యబ్బురంబనరొ మేలనరో కొనియాడరో కవిన్”
(పొన్నగంటి తెలగన్న పద్యపాదానికి చిన్న మార్పు)

12, జులై 2023, బుధవారం

సమస్య - 4474

13-7-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పెండ్లి దుర్ముహూర్తమ్మునఁ బ్రీతిఁ గూర్చు”
(లేదా...)
“పెండ్లాడం దగు దుర్ముహూర్తమున నిర్వేదమ్ముఁ బోనాడుచున్”

11, జులై 2023, మంగళవారం

దత్తపది - 198

12-7-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
"నది - ఏరు - వాగు - కాలువ"
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో స్వేచ్ఛాఛందంలో
పద్యం వ్రాయండి

10, జులై 2023, సోమవారం

సమస్య - 4473

11-7-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలహము శుభముల నొసఁగు నగణ్యముగ భువిన్”
(లేదా...)
“కలహముచే శుభంబుల నగణ్యముగాఁ గనవచ్చు ధాత్రిపై”

9, జులై 2023, ఆదివారం

సమస్య - 4472

10-7-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గొడుగు గలదు కాని తడిపె వాన”
(లేదా...)
“గొడుగున్ జేత ధరించియున్ దడిసితిన్ ఘోరంపు వర్షమ్మునన్”

8, జులై 2023, శనివారం

సమస్య - 4471

9-7-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అన్నములోఁ గేశమున్న నది నీదే పో”
(లేదా...)
“అన్నము కేశదుష్టమని యాగ్రహ మెందుల కద్ది నీదె పో”

7, జులై 2023, శుక్రవారం

సమస్య - 4470

8-7-2023(శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పుస్తకము గాదిపుడు హస్తభూషణమ్ము”
(లేదా...)
“పుస్తకమన్న నేఁడు గరభూషణమన్నది వట్టిమాటయే”

6, జులై 2023, గురువారం

సమస్య - 4469

7-7-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హరిణమ్మునుఁ గాంచి సింహ మడలి పరుగిడెన్”
(లేదా...)
“హరిణముఁ గాంచి సింహము భయమ్మునఁ బాఱెను ప్రాణభీతితోన్”

5, జులై 2023, బుధవారం

సమస్య - 4468

6-7-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మేడిపండులో విశ్వమున్ జూడఁగలము”
(లేదా...)
“వింతగఁ గానుపించునఁట విశ్వము సర్వము మేడిపండులో”

4, జులై 2023, మంగళవారం

సమస్య - 4467

5-7-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నరకములోఁ గాంచెదరట నాకసుఖములన్”
(లేదా...)
“నరకములోనఁ గాంచెదరు నాకసుఖంబులఁ బాపులెల్లరున్”

3, జులై 2023, సోమవారం

సమస్య - 4466

4-7-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తన్నిరి ప్రాశ్నికులు శతవధానినిఁ గంటే”
(లేదా...)
“తన్నిరి ప్రాశ్నికుల్ శతవధానిని వేదిక మీఁదఁ జూచితే”

2, జులై 2023, ఆదివారం

సమస్య - 4465

3-7-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శరతల్పముపై సురతము స్వర్గమ్మె యగున్”
(లేదా...)
“శరతల్పమ్మున మానినీ మధుర సంసర్గంబు స్వర్గంబగున్”

1, జులై 2023, శనివారం

సమస్య - 4464

2-7-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విజయము రామునకు మిగుల వేదనఁ బెంచెన్”
(లేదా...)
“విజయము రామచంద్రునకు వేదనఁ బెంచె నదేమి చిత్రమో”

30, జూన్ 2023, శుక్రవారం

సమస్య - 4463

1-7-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వ్యాధిగ్రస్తుఁడన భాగ్యవంతుఁడె సుమ్మీ”
(లేదా...)
“వ్యాధిగ్రస్తులు భాగ్యవంతులు సుమీ భావింప లోకంబునన్”

29, జూన్ 2023, గురువారం

సమస్య - 4462

30-6-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఏడ్పు కాపురమ్మునఁ గలిగించు ముదము”
(లేదా...)
“ఏడ్పులు సంతసంబు కలిగించును కమ్మని కాపురంబునన్”

28, జూన్ 2023, బుధవారం

సమస్య - 4461

29-6-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శకునిగ రాఘవుని మునులు శ్లాఘింతు రహో”
(లేదా...)
“శకునిగ వీరరాఘవుని సన్నుతి చేసెద రెల్ల సాధువుల్”

27, జూన్ 2023, మంగళవారం

న్యస్తాక్షరి - 81

28-6-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
పాదాద్యక్షరాలుగా 'కా-కీ-కూ-కే' లను న్యస్తం చేస్తూ
సకాలంలో వర్షాలు పడక బాధపడే రైతులను గురించి
ఉత్పలమాల లేదా కందం వ్రాయండి